విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారా....అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి  

  • ఈ రోజుల్లో మారిన జీవనశైలి,విద్య, ఉద్యోగం, వ్యాపారం, సాధించాలనే తపన వంటి కారణాలతో విపరీతమైన ఒత్తిడికి గురి అవుతున్నారు. జీవితంలో పరుగెడుతూ పనులను చేస్తూ మానసికంగా బాగా అలసిపోతున్నారు. ఆ మానసిక ఒత్తిడి చివరకు డిప్రెషన్ కి దారి తీస్తుంది. ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒత్తిడి తగ్గటానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి… ఏమి చేయాలో వివరంగా తెలుసుకుందాం.

  • -

  • ఒత్తిడి తగ్గాలంటే ఒంటరిగా లేకుండా నలుగురిలో ఉంటూ సరదాగా గడపాలి. అలాగే ఇష్టమైన ప్రదేశాలకు ఇష్టమైన వారితో వెళ్లి ఆనందంగా గడపాలి. ఈ విధంగా చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.

  • బిజీ జీవితంలో నుంచి కాస్త బయటకు వచ్చి వినోదాన్ని ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోవాలి. అప్పుడు మైండ్ రీ ఫ్రెష్ అవుతుంది.

  • ఒత్తిడి అనిపించినప్పుడు పజిల్స్ నింపడం, పదవినోదం, మెదడుకు మేత వంటి వాటిని సాల్వ్ చేస్తూ ఉంటే ఒత్తిడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.

  • పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, యోగా,ఇష్టమైన ఆటలను ఆడటం,స్విమ్మింగ్ చేయటం వంటివి చేసిన ఒత్తిడి తగ్గుతుంది. వీటిని చేయటానికి ప్రతి రోజు కొంత సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

  • పాలు, బాదం పప్పు, నారింజ పండ్లు, పాలకూర, చేపలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. వీటిలో ఉండే పోషకాలు ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి.