ఊపిరితిత్తులను సహజంగా శుభ్రం చేసుకొనే పద్ధతులు ఉన్నాయని మీకు తెలుసా?       2018-06-09   23:12:05  IST  Lakshmi P

మారిన పరిస్థితుల కారణంగా వాతావరణంలో విపరీతమైన కాలుష్యం పెరిగిపోయింది. వాతావరణ కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఒక్క కాలుష్యం వల్లనే కాకుండా పొగ త్రాగటం,కొన్ని దీర్ఘ కాలిక వ్యాధుల కారణముగా ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలి. ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం పరగడుపున 5 తాజా పుదీనా ఆకులను నమిలితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక స్పూన్ అల్లం రసం త్రాగితే ఊపిరితిత్తులలో ఉండే విష పదార్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ఆరెంజ్, అరటిపండు, కంద‌గ‌డ్డ‌లు, క్యారెట్లు,కొబ్బరి నీళ్లు వంటి పొటాషియం సమృద్ధిగా ఉండే ఆహారాలను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

క్యారెట్ జ్యుస్ ని ఫ్రెష్ గా తీసుకోని ఉదయం ఒకసారి, మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అరచెక్క నిమ్మరసం పిండుకొని త్రాగితే ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.

ప్రతి రోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ త్రాగితే ఊపిరితిత్తులలో ఉండే వ్యర్ధాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి.