వ‌డ‌దెబ్బకు దూరంగా ఉండాలా..అయితే ఈ టిప్స్ మీకే!

వేస‌వి కాలం రానే వ‌చ్చింది.మార్చి నెల‌లో అలా అడుగు పెట్టామో లేదో.

 Tips For How To Prevent Sunstroke! Sunstroke, Home Remedies, Summer Season, Summ-TeluguStop.com

భానులు నిప్పులు కురిపిస్తున్నాడు.ఎండ‌ల దెబ్బ‌కు జ‌నాలు విల‌విల‌లాడిపోతున్నారు.

ఇక ఈ వేస‌వి కాలంలో వ‌డ దెబ్బ స‌మ‌స్య ఎంత‌లా ఇబ్బంది పెడుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.వ‌డ దెబ్బ త‌గిలిందంటే.

అల‌స‌ట‌, వాంతులు, వికారం, గుండె వేగంగా కొట్టుకోవ‌డం, గంద‌ర‌గోళంగా అనిపించ‌డం, చ‌ర్మం పొడిబారిపోవ‌డం, త‌ల‌నొప్పి ఇలాంటి ల‌క్ష‌ణాల‌న్నీ క‌నిపిస్తాయి.ఇక ఒక్కో సారి వ‌డ దెబ్బ కార‌ణంగా ప్రాణాలు కూడా పోతుంటాయి.

అందుకే వ‌డ దెబ్బ‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.మ‌రి అలా ఉండాలీ అంటే ఖ‌చ్చితంగా కొన్ని టిప్స్‌ను ఫాలో అవ్వాల్సిందే.ఈ వేస‌వి కాలంలో వ‌డ దెబ్బ నుంచి ర‌క్షించ‌డంలో పుదీనా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పుదీనా ఆకుల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని సేవిస్తే.

శరీరం ఉష్ణోగ్రతను నెమ్మదించేలా చేసే వ‌డ దెబ్బ‌కు దూరంగా ఉంచుతుంది.

Telugu Butter Milk, Coconut, Cotton Dresses, Tips, Latest, Season, Sunstroke-Tel

అలాగే వ‌డ దెబ్బ బారిన ప‌డ‌కుండా ఉండాలీ అంటే.పండ్ల ర‌సాలు, మ‌జ్జిగ‌, కొబ్బ‌రి నీళ్లు ఎక్కువ‌గా తీసుకోవాలి.కూల్ డ్రింక్స్‌, సోడాలు, ఆల్క‌హాల్‌, టీలు, కాఫీలు వంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

ఉల్లిగ‌డ్డ కూడా వ‌డ దెబ్బ నుంచి ర‌క్షిస్తుంది.ప‌చ్చి ఉల్లిపాయ‌ను స‌లాడ్స్‌లో క‌లిపి తీసుకోవ‌డం లేదా డైరెక్ట్‌గా తీసుకోవ‌డం చేస్తే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది.

ఇక బ‌య‌ట‌కు వెళ్లే ముందు ఖ‌చ్చితంగా ఒక‌టి లేదా రెండు గ్లాసులు మంచి నీరు తీసుకుని వెళ్లాలి.అంతేకాదు, బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు వదులుగా ఉండే పల్చని కాట‌న్ దుస్తుల‌నే ధ‌రించాలి.

తలపై ఎండ పడకుండా స్కాఫ్‌తో క‌వ‌ర్ చేసుకోవాలి.డీహైడ్రేష‌న్ కూడా వ‌డ దెబ్బ‌కు ఒక కార‌ణం.

కాబ‌ట్టి, వాట‌ర్‌తో పాటు ఓఆర్ఎస్, గ్లూకోజ్ వంటివి త‌ర‌చూ తీసుకుంటే శ‌రీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.మ‌రియు నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా ఉంటారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube