లోబీపీతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే!  

tips for how to get rid of low blood pressure! low blood pressure, blood pressure, latest news, health tips, health, good health, bp - Telugu Blood Pressure, Bp, Good Health, Health, Health Tips, Latest News, Low Blood Pressure

లో బీపీ.నేటి కాలంలో చాలా మంది ఈ స‌మ‌స్యతో బాధ ప‌డుతున్నారు.

TeluguStop.com - Tips For How To Get Rid Of Low Blood Pressure

బీపీ సాధారణ స్థాయి కంటే బాగా త‌క్కువ‌గా ఉండ‌ట‌మే లోబీపీ అంటున్నారు.హై బీపీ ఎంత ప్ర‌మాద‌మో లోబీపీ కూడా అంతే ప్ర‌మాదం అన‌డంలో సందేహం లేదు.

లోబీపీ వచ్చిన‌ప్పుడు శ‌రీరంలోని అన్ని అవ‌యవాల‌కు ర‌క్త స‌ర‌ఫ‌రా ఆగిపోతుంది.ఆ స‌మ‌యంలో ఒక్కోసారి గుండె పోటు, పక్షవాతం వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

TeluguStop.com - లోబీపీతో బాధ‌ప‌డుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీ కోస‌మే-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇక లో బీపీ రావ‌డానికి చాలా కార‌ణాలు ఉన్నాయి.

ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న శైలి, ర‌క్తం స‌రిప‌డా లేక‌పోవ‌డం, కొన్ని మందుల వాడ‌కం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లోబీపీ ఏర్ప‌డుతుంది.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.లోబీపీ స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.లోబీపీ స‌మ‌స్య ఉన్న వారు గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ లేదా కాఫీ వంటివి తీసుకోవాలి.

ఎందుకంటే, ఇందులో పుష్ప‌లంగా ఉండే కెఫీన్ ర‌క్త పోటును అదుపులోకి తెస్తుంది.డీహైడ్రేష‌న్ వ‌ల్ల కూడా లోబీపీ వ‌స్తుంది.

కాబ‌ట్టి, ప్ర‌తి రోజు నీరు ఎక్కువ‌గా తీసుకోవాలి.మ‌రియు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటుండాలి.ఇక‌ విల‌మిన్ ఇ మ‌రియు విటిమ‌న్ బి12 లోబీపీ స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, ఆ విట‌మిన్లు ఉండే పాల‌కూర‌, గుడ్లు, పాలు, చేప‌లు, దుంప‌లు, న‌ట్స్ వంటి రెగ్యుల‌ర్‌గా తీసుకోవాలి.

అలాగే లోబీపీ ఉన్న వారు వెంట‌నే నీటితో కాస్త ఉప్పు క‌లిపి తీసుకోవాలి.ఇలా చేసినా బీపీ కంట్రోల్‌లోకి వ‌స్తుంది.లోబీపీ స‌మ‌స్య‌ ఉన్న ‌వారు ఒకేసారి ఆహారం తీసుకోరాదు.రోజులో క‌నీసం ఐదారు సార్లు కొద్దిగా తీసుకుంటే.

ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది.లోబీపీ ఉన్న వారు ప్ర‌తి రోజు ఖ‌చ్చితంగా ఒక‌టి లేదా రెండు అర‌టి పండ్లు తీసుకోవాలి.

ఎందుకంటే, ఇందులో ఉండే పొటాషియం లోబీపీని నివారిస్తుంది.

#Blood Pressure #Health #Health Tips #Good Health

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు