గోళ్లు పెళుసుగా మారకుండా ఉండాలంటే....  

Tips For Healthy Nails-

English Summary:A lot of people are broken nails become brittle. Some foods must be to prevent this situation.Bayotin missing this problem will be waiting in the body. Bayotin adhikamincalante rich foods should be available for this error.

Beans, kyaliphlavar, eggs, red urad, fish, legumes, taking much of our body gets the necessary bayotin.

Diets high in fatty acids should be taken when fragile nails.Flax seeds are rich in fatty acids, fish oil, spinach, walnuts increase in consumption.

Nail problems caused by protein deficiency.It is rich in Vitamin A, where egg white, aprikats, oatmeal, take foods like asparagus.

Massage is a good result if the nails in warm olive oil.......

చాలా మందికి గోళ్లు పెళుసుగా మారి విరిగిపోతూ ఉంటాయి. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరంలో బయోటిన్ లోపించినప్పుడు ఈ సమస్య ఎదురు అవుతుంది..

గోళ్లు పెళుసుగా మారకుండా ఉండాలంటే.... -

ఈ లోపాన్ని అధికమించాలంటే బయోటిన్ సమృద్ధిగా లభించే ఆహారాలను తీసుకోవాలి.బీన్స్, క్యాలీఫ్లవర్,గుడ్లు,ఎర్ర కందిపప్పు,చేపలు,బఠాణిలను ఎక్కువగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన బయోటిన్ అందుతుంది.గోళ్లు పెళుసుగా మారినప్పుడు ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉన్న అవిసె గింజలు,చేప నూనె,పాలకూర,వాల్నట్స్ వినియోగాన్ని పెంచాలి.ప్రోటీన్స్ లోపం వలన కూడా గోళ్ళ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు దూరం కావాలంటే ప్రోటీన్స్ సమృద్ధిగా లభించే వెన్న తీసిన పాలు, చికెన్,పప్పులు,సొయా బీన్ వంటి పదార్ధాలు తీసుకోవాలి.

గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ ‘ఏ’ బాగా సహాయపడుతుంది. అందువల్ల విటమిన్ ఏ సమృద్ధిగా లభించే గుడ్డు తెల్లసొన,ఆప్రికాట్స్,ఓట్ మీల్, తోటకూర వంటి ఆహారాలను తీసుకోవాలి.గోరువెచ్చని ఆలివ్ ఆయిల్ ని గోళ్లకు మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.