రేపు జాగ్రత్త : ఎన్నికల ఫలితాలు చూసే సమయంలో అభ్యర్థులు, ప్రేక్షకులు పాటించాల్సిన జాగ్రత్తలు

దాదాపు రెండు నెలలుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న ఎన్నికల ఫలితాలు రేపు రాబోతున్నాయి.పార్లమెంటు ఫలితాలు మాత్రమే అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంత టెన్షన్‌ వాతావరణం ఉండేది కాదు.

 Tips For Election Results Watching Audiences-TeluguStop.com

ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి.ఏపీలో ఎవరు సీఎం అవుతారా అంటూ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఏపీతో పోల్చితే తెలంగాణ కాస్త కూల్‌గానే ఉన్నా మొత్తాని తెలుగు రాష్ట్రాల జనాలు నరాలు తెగిపోయే ఉత్కంఠతతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.సామాన్యుల పరిస్థితి ఇలా ఉంటే ఇక అభ్యర్థుల పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అభ్యర్థుల కోసం తిరిగి ప్రచారం చేసిన వారు, అభ్యర్థుల కోసం ఇతర పార్టీల వారితో గొడవలు పడ్డ వారు ఏ స్థాయిలో ఉత్కంఠతతో ఎదురు చూస్తుంటారో ఊహించుకుంటేనే అర్థం అవుతోంది.గత కొన్ని రోజులుగా బీపీలు పెంచుకుని మరీ ఎదురు చూస్తున్న రోజు రాబోతుంది.

రేపు అంటే మే 23న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.ఉదయం నుండి సాయంత్రం వరకు లెక్కింపు జరుగబోతుంది.

అయితే మద్యాహ్నం వరకు ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న వారు ఖచ్చితంగా ఈ విధంగా టీవీల ముందు కూర్చోండి.

ఇక ముఖ్యంగా బీపీ మరే ఇతర గుండె జబ్బు ఉన్న వారు ముఖ్యంగా ఈ విషయాలను పాటించండి.టీవీల ముందు ఒక్కరు మాత్రమే కూర్చోకుండా కనీసం ఇద్దరు ముగ్గురు అయినా కూర్చుని ఉండాలి.

ఎందుకంటే ఫలితాల గురించి పక్కన వారితో చర్చస్తున్న సమయంలో ఒత్తిడి తగ్గినట్లుగా ఉంటుంది.ఫలితాలను ఉగ్గబట్టి చూడకుండా కొద్ది నిమిషాల పాటు కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండండి.

ఖచ్చితంగా అర్థ గంటకు ఒకసారి అయినా వాటర్‌ తాగుతూ ఉండాలి.ఉత్కంఠతతో ఎదురు చూస్తూ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, కనుక నీరు తాగుతూ ఉండాలి.టీవీలో బ్రేక్‌ సమయంలో వెంటనే వేరే ఛానల్‌ మార్చకుండా దాన్నే కొనసాగించాలి.యాడ్స్‌ చూడటం వల్ల కాస్త ఒత్తిడి నుండి రిలాక్స్‌ అయ్యే అవకాశం ఉంటుంది.

అందుకే యాడ్స్‌ను కొనసాగించాలి.ఒక్క రౌండ్‌ తోనే ఫలితాలు తేలిపోవు.

చాలా ఎక్కువగా రౌండ్లు ఉంటాయి.చివరి రౌండ్‌ వరకు ఫలితాలు తారు మారు అయ్యే అవకాశం ఉంది.

-Telugu Political News

అందుకే కొన్ని రౌండ్లు పూర్తి అవ్వగానే ఫలితాలపై అంచనాకు వచ్చి ఒత్తిడికి గురవ్వాల్సిన అవసరం లేదు.గాలి ఎక్కువగా ఆడేలా రూంలో ఏర్పాటు చేసుకుని ఫలితాలను టీవీలో చూస్తే బెటర్‌.మరీ ఇన్వాల్వ్‌ అయ్యి మరీ ఫలితాలను చూడటం కూడా మంచిది కాదు.కొద్ది బ్రేక్‌ తీసుకుంటే గుండె వేగం తగ్గుతుంది.తద్వారా ప్రమాదం ఉండదు.ఈ జాగ్రత్తలు తీసుకుని రేపు రిజల్ట్స్‌ను టీవీల్లో చూడండి.

తప్పకుండా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో స్నేహితులతో షేర్‌ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube