'తిప్పరా మీసం' మూవీ రివ్యూ అండ్ రేటింగ్  

Tippara Meesam Movie Review And Rating-

విభిన్న చిత్రాల హీరోగా పేరు దక్కించుక్ను శ్రీవిష్ణు కాస్త నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను ఈ చిత్రంలో చేశాడు.విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ చిత్రంకు మొదటి నుండి మంచి పబ్లిసిటీ చేశారు.

Tippara Meesam Movie Review And Rating--Tippara Meesam Movie Review And Rating-

ట్రైలర్‌ విడుదల తర్వాత సినిమాలో మ్యాటర్‌ ఉంటుందేమో అనిపించింది.అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.మరి సినిమాలో మ్యాటర్‌ ఉందా, చూడవచ్చా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

మృదు స్వభావి అయిన హీరో మెల్లగా బెట్టింగ్‌లకు బానిస అవుతాడు.బెట్టింగ్‌ల కారణంగా జీవితాన్ని నాశనం చేసుకుని చివరకు తల్లిపై అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తాడు.పూర్తిగా రాక్షసంగా మారిన అతడు మళ్లీ ఎలా ఆ లోకం నుండి బయటకు వస్తాడు, అసలు బెట్టింగ్స్‌కు ఎందుకు అలవాటు పడ్డాడు, బెట్టింగ్‌లతో అతడి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటీ ఇంతకు అవి ఎలాంటి బెట్టింగ్‌లు అనేది ఈ రివ్యూలో చూద్దాం.

నటీనటుల నటన :

శ్రీవిష్ణు నటన ది బెస్ట్‌ అన్నట్లుగా ఉంది.హీరోగా రొమాంటిక్‌గా లవ్‌ సీన్స్‌లో ఎవరైనా నటిస్తారు.ఎవరైతే నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నటిస్తారో వారే గ్రేట్‌.విలనిజం చూపుతూ నటించడం అంటే మామూలు విషయం కాదు.అది కూడా హీరోయిజంతో కూడిన విలనిజంను చూపడం అంటే చాలా గొప్ప విషయం.శ్రీవిష్ణు ఆ విషయంలో పూర్తిగా సక్సెస్‌ అయ్యాడు.హీరోయిన్‌ నిక్కీ తంబోలా ఉన్నంతలో పర్వాలేదు అనిపించింది.ఆమెకు నటించే స్కోప్‌ ఎక్కువగా దక్కలేదు.శ్రీవిష్ణు తల్లి పాత్రలో రోహిణి నటించింది.ఆమె తనదైన నటనతో అద్బుతంగా మెప్పించింది.ముఖ్యంగా ఆమె పలు సీన్స్‌లో సహజ నటనతో మెప్పించి ఆకట్టుకుంది.ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధిలో నటించి పర్వాలేదు అనిపించారు.

టెక్నికల్‌ :

సురేష్‌ బొబ్బిలి అందించిన సంగీతం సినిమాకు పెద్దగా అసెట్‌ అవ్వలేదు.ముఖ్యంగా పాటలు సినిమాకు స్పీడ్‌ బ్రేకర్స్‌ అన్నట్లుగా ఉన్నాయి.ఇక బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ పర్వాలేదు అన్నట్లుగా ఉంది.మొత్తంగా సంగీతం సినిమాకు సో సో గానే ఉంది.ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.కొన్ని బెట్టింగ్‌ సీన్స్‌ లెంగ్త్‌ చాలా ఎక్కువ అయ్యింది.అలాగే సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా లెంగ్త్‌ ఎక్కువ అవ్వడంతో బోరింగ్‌గా అనిపించింది.స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండి ఉంటే బాగుండేది.సినిమాటోగ్రఫీ యావరేజ్‌గా ఉండి మెప్పించింది.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.దర్శకత్వం బాగుంది.

విశ్లేషణ :

ఇటీవలే వచ్చిన ‘గద్దలకొండ గణేష్‌’ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ నెగటివ్‌ టచ్‌ ఉన్న పాత్రను చేసిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో వరుణ్‌ ఎలా అయితే చాలా రూడ్‌గా కనిపించి మెప్పించాడో అలాగే ఈ సినిమాలో కూడా శ్రీవిష్ణు ఆకట్టుకున్నాడు.

సినిమాలో అతడి నటన పీక్స్‌లో ఉంది.ఇది అతడి కెరీర్‌ ది బెస్ట్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక తల్లి సెంటిమెంట్‌ సీన్స్‌లో శ్రీవిష్ణు జీవించేశాడు.సినిమా మొదటి సగం పర్వాలేదు అనిపించినా సెకండ్‌ హాఫ్‌ మాత్రం చాలా బాగుంది.

అద్బుతమైన స్క్రీన్‌ప్లేతో కొన్ని సీన్స్‌ కట్టిపడేశాయి.కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులు లీనం అయ్యి పోవడంతో కథతో జర్నీ చేయడం జరుగుతుంది.అలా తిప్పరా మీసం సినిమాను ప్రేక్షకులు చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు.అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆశించినంతగా లేకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇది ఎలా ఎక్కుతుందో చూడాలి.

ప్లస్‌పాయింట్స్‌ :

తల్లి కొడుకు సెంటిమెంట్‌,

బెట్టింగ్‌ సన్నివేశాలు

మైనస్‌ పాయింట్‌ :

సంగీతం,

ఎడిటింగ్‌,

ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం.

బోటమ్‌ లైన్‌ :

శ్రీవిష్ణు తిప్పాడ్రా మీసం,

బొమ్మ బాగుంది

రేటింగ్‌ : 2.75/5.0