పాపం.. ఈ సినిమాలు హిట్.. కానీ కలెక్షన్లు మాత్రం లేవట...

తెలుగులో ఇటీవలే కరోనా వైరస్ కారణంగా మూతపడిన థియేటర్లు తెరుచుకున్న సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ప్రముఖ హీరో సత్యదేవ్ మరియు నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన “తిమ్మరుసు” చిత్రం సినిమా థియేటర్లలో విడుదలైంది.

 Timmarusu And Ishq Movie Collection Disaster For Corona Effect, Timmarusu, Ishq-TeluguStop.com

అయితే ఎంతో ఉత్సాహంతో చిత్రయూనిట్ సభ్యులు ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలు సినిమా థియేటర్లకు రావడానికి జంకుతున్నారు.దీంతో ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం పెద్దగా సాధించలేకపోయింది.

అయితే ఇటీవలే విడుదలైన “ఇష్క్” చిత్రం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వసూళ్ల విషయంలో మాత్రం వెనుకబడిపోయింది.దీంతో కలెక్షన్లు లేకపోవడంతో పలు చోట్ల కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు నష్ట పోయారు.

దీంతో చిత్ర యూనిట్ సభ్యులు కొంతమేర డైలమాలో పడినట్లు సమాచారం.దీనికితోడు ఇటీవల సినిమా థియేటర్ల యజమానులు టికెట్ల ధరలు తక్కువగా ఉండటం వల్ల నడపడం కష్టంగా ఉందని కాబట్టి టికెట్ల ధరలు పెంచుకుని కల్పించాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

అసలే కష్టకాలం కరోనా వైరస్ కారణంగా ఆదాయం లేకపోవడంతో కొంత మంది ప్రజలు ఎక్కువగా ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఇష్ట పడుతున్నారు.కాగా తిమ్మరుసు చిత్రం విడుదలైన మొదటి రోజు 25 లక్షల రూపాయల షేర్ ని సాధించినట్లు సమాచారం.

ఇక ఇష్క్ సినిమా పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Telugu Ishq, Sathyadev, Teja Sajja, Timmarusu, Timmarusuishq, Tollywood, Tolywoo

ఏదేమైనప్పటికీ ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ వందల కోట్ల రూపాయలు నష్ట పోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.కాగా ప్రస్తుతం మళ్లీ థర్డ్ వేవ్ తొందర్లోనే ఉండబోతుందని పలు వార్తలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.దీన్ని బట్టి చూస్తే గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ప్రజలు పూర్తిగా ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube