నేడు విడుదల అయిన సినిమాలు బ్రేక్‌ ఈవెన్‌ ఎంతో తెలుసా?

కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా నిలిచి పోయిన సినిమాలు మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి.నేటి నుండి మళ్లీ టాలీవుడ్‌ లో విడుదల సందడి కనిపిస్తుంది.

 Timmarusu And Ishq Movie Break Even Number-TeluguStop.com

మూడు నెలలు గా పెద్ద సినిమాలు చిన్న సినిమా లు ఏ ఒక్కటి కూడా విడుదల కాలేదు.ఎట్టకేలకు తిమ్మరుసు మరియు ఇష్క్ సినిమా లు వచ్చాయి.

థియేటర్లు నడిచే పనిస్థితి లేదు.కరోనా వల్ల జనాలు థియేటర్లకు వస్తారా లేదా అనే అనుమానం ఉంది.

 Timmarusu And Ishq Movie Break Even Number-నేడు విడుదల అయిన సినిమాలు బ్రేక్‌ ఈవెన్‌ ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి సమయంలో ఎలా తిమ్మరుసు సినిమా ను విడుదల చేస్తున్నారు అంటూ కొందరు ప్రశ్నించారు.ఈ సినిమా లు విడుదల అయితే కనీసం పబ్లిసిటీ ఖర్చు అయినా వస్తుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఇలాంటి సమయం లో చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలు తక్కువ బడ్జెట్‌ తో రూపొందాయట.

Telugu Film News, Ishq, Movie News, Telugu Film Review, Thimmarusu-Movie

ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ తిమ్మరుసు సినిమా అయిదు కోట్లతో రూపొందింది.సినిమాను బయ్యర్లు రెండున్నర కోట్ల కు కొనుగోలు చేశారు.ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే 2.6 కోట్ల రూపాయలను వసూళ్లు చేయాల్సి ఉంది.పెద్ద ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో రెండున్నర కోట్లు ఈజీగానే వసూళ్లు చేస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు.

ఇక ఇష్క్‌ విషయానికి వస్తే ఈ సినిమాకు కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారట.ఈ సినిమా కూడా 2.6 కోట్ల వరకు బిజినెస్ చేసింది.కనుక ఈ సినిమాను 2.7 కోట్ల వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్‌ సాధించినట్లు గా పరిగణించవచ్చు అంటున్నారు.మొత్తాని కి ఇండస్ట్రీ వర్గాల వారు ఈ సినిమాలపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.

మరి సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సినిమాలు సక్సెస్ అయ్యి వసూళ్లు సాధిస్తే వచ్చే వారం నుండి టాలీవుడ్‌ సినిమాల జాతర మొదలు అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#Thimmarusu #Ishq

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు