దారుణం : సరదాగా ఉరి వేసుకున్నాడు... అది కాస్త సీరియస్‌ అయ్యింది

తాగిన సమయంలో మనిషి ఏం చేస్తున్నాను అనే విచక్షనను కోల్పోతాడు.అలాంటి సమయంలో ఏం చేశామనేది తర్వాత రోజు గుర్తు ఉండదు.

 Time Pass-TeluguStop.com

కొన్ని సార్లు తాగి చేసిన తప్పుతో జీవితమే నాశనం అవ్వడం జరుగుతుంది.కొన్ని సార్లు జీవితమే అంతం అవ్వడం జరుగుతుంది.

ఈ రెండు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి.తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు తన స్నేహితుడికి వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

అయితే అతడు నిజంగా ఆత్మ హత్య చేసుకుంటాడని భావించలేదు.కాని ఆ వ్యక్తి సరదాగా స్నేహితుడిని భయపెట్టాలని భావించి నిజంగానే చనిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చిత్తూరు జిల్లా తిరుచునూర్‌ సమీపంలోని దామినీడుకు చెందిన శివ కుమార్‌ అనే యువకుడు తాజాగా ఫుల్‌గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు.

ఇంటికి వచ్చిన తర్వాత అతడు స్నేహితుడికి వీడియో కాల్‌ చేశాడు.ఆ వీడియో కాల్‌లో ఏమి మాట్లాడుకున్నారో ఏమో కాని, ఇద్దరు కూడా కాస్త సమయం మాట్లాడుకున్న తర్వాత శివ కుమార్‌ ఫ్యాన్‌కు చీర కట్టి, దానిని మెడకు తగిలించుకున్నాడు.

ఆ తర్వాత మంచం నుండి కిందకు దిగాడు.

ఆ తర్వాత మళ్లీ మంచంపై నిలబడాలని ప్రయత్నించాడు.కాని అప్పటికే అతడి మెడకు బలంగా బిగుసుకు పోవడంతో మంచంను అందుకోవడంలో అతడు విఫలం అయ్యాడు.మెడకు బలంగా బిగుసుకున్న కారణంగా చూస్తుండగానే అతడి ప్రాణం గాల్లో కలిసి పోయింది.

ఇదంతా వీడియో కాల్‌లో చూస్తున్న వ్యక్తి మాత్రం అలాగే ఉండిపోయాడు.ఏం చేస్తున్నాడో అర్థం చేసుకునే లోపే అంతా అయిపోయిందని అవతలి వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube