'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ టైం ఫిక్స్.. మాస్ మూల విరాట్ వేట స్టార్ట్!

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో దసరా పండుగకు వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు మరో పండుగను కబ్జా చేసేందుకు రెడీ అవుతున్నారు.

 Time Locked For Waltair Veerayya Trailer Release, Megastar Chiranjeevi, Waltair-TeluguStop.com

సంక్రాంతి కానుకగా మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేయడానికి మరోసారి మెగాస్టార్ కొత్త సినిమాతో రాబోతున్నాడు.చిరంజీవి మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘వాల్తేరు వీరయ్య‘ 2023 సంక్రాంతి బరిలో భారీ పోటీ మధ్య వాల్తేరు వీరయ్య సినిమా కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరుకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర అవుతున్న కొద్దీ మెగా ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వచ్చిన పోస్టర్స్, పాటలు ఇప్పటికే బాగా అలరిస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరి అందరి ఎదురు చూపులకు ఈ రోజుతో తెరపడబోతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు జరగనుండగా ఈ రోజు ట్రైలర్ లాంచ్ ను చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు.ఈ మేరకు సాలిడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6 గంటల 3 నిముషాలకు అని తెలుస్తుంది.మాస్ మూల విరాట్ వేట మొదలు అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ట్రైలర్ టైం ను ఫిక్స్ చేసారు.చూడాలి ట్రైలర్ ఎలా అలరిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube