ఆట్.. మహేష్ సినిమా అప్‌డేట్‌కు టైమ్ ఫిక్స్!  

Time Fixed For Mahesh Babu New Movie Announcement - Telugu Mahesh Babu, Parasuram, Ssmb27, Tollywood News

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు మహేష్.

 Time Fixed For Mahesh Babu New Movie Announcement

ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాగా ఈ సినిమాను తొలుత మే 31న ప్రారంభిస్తారని చిత్ర వర్గాలు చెప్పుకొచ్చాయి.కానీ మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల గతేడాది మృతిచెందడం, ఇంకా ప్రథమ వర్ధంతి జరగకపోవడంతో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఉండకపోవచ్చని మహేష్ సన్నిహితులు చెప్పుకొచ్చారు.

ఆట్.. మహేష్ సినిమా అప్‌డేట్‌కు టైమ్ ఫిక్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

దీంతో మహేష్ ఫ్యాన్స్ చాలా ఆందోళనకు గురయ్యారు.కానీ వారికి సంతోషానిచ్చే వార్తను సదరు చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది.మే 31న ఉదయం 9.09 గంటలకు మహేష్ 27వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఉంటుందని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది.

దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషంతో ఊగిపోతున్నారు.తమ అభిమాన హీరోకు సంబంధించిన కొత్త చిత్రం గురించి అప్‌డౌట్ వస్తుండటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ప్రొడ్యూ్స్ చేస్తున్నారు.మరి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Time Fixed For Mahesh Babu New Movie Announcement Related Telugu News,Photos/Pics,Images..

footer-test