హీరోయిన్ కి వింతైన పెళ్లి ప్రపోజల్.. సోషల్ మీడియాలో వైరల్

Tillotama Shome Received A Hilarious Marriage Proposal, Bollywood, Tollywood, Indian Cinema, Heroines, Social Media

అందాల భామలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తమ ఫ్యాన్స్ కి నిత్యం అందుబాటులో ఉంటున్నారు.అప్పుడప్పుడు తమ సినిమాలకి సంబందించిన ముచ్చట్లు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు.

 Tillotama Shome Received A Hilarious Marriage Proposal, Bollywood, Tollywood, In-TeluguStop.com

అలాగే తమ ఫోటోలతో అభిమానులకి వినోదాన్ని అందిస్తున్నారు.అయితే అప్పుడప్పుడు హీరోయిన్స్ కి ఫ్యాన్స్ నుంచి కొన్ని లవ్ ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి.

వాటిలో చాలా వరకు రెగ్యులర్ గా ఉంటే కొన్ని మాత్రం వింతగా ఉంటాయి.అలాంటి వింతైన ప్రపోజల్స్ ని హీరోయిన్స్ కూడా అందరితో పంచుకోవడానికి ఇష్టపడతారు.

ఇప్పుడు అలాంటి వింతైన ప్రపోజల్ బాలీవుడ్ హీరోయిన్ తిలోత్తమ షోమ్ కి వచ్చింది.

తిలోత్తమకు తనను పెళ్లి చేసుకుంటానంటూ ఓ వ్యక్తి నుంచి ప్రపోజల్‌ వచ్చింది.

అయితే ఈ ప్రపోజల్‌ గులాబి పువ్వుతో, ప్రేమ లేఖతో కాకుండా ఓ చిన్న మెసేజ్ తో పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు.అయితే ఆ మెసేజ్ లో ఒక విశేషం ఉంది.

ఐ లవ్‌ యూ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా.జీవితాంతం మీతో కలిసి ఉంటాను.

నేను వర్జిన్‌.అలాగే వెజిటేరియన్‌ కూడా.

అంతేగాక లై- డిటెక్టర్‌, నార్కో టెస్టు, వర్జినిటి, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ టెస్టు చేయించుకోడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ మెసేజ్‌ చేశారు.దీనిపై స్పందించిన తిలోత్తమ బ్రదర్‌ జోక్‌గా ఉందా, అవసరం లేదు ధన్యవాదాలు.

బై బై అంటూ ఈ స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.ఇప్పుడు ఈ వింతైన ప్రపోజల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తనకి కూడా ఒక వ్యక్తి నుంచి ఇలాంటి ప్రపోజల్ వచ్చింది అంటూ ఇషాచోప్రా కూడా దీనిపై స్పందించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube