ఒకే ఒక్కడి కారణంగా టిక్ టాక్ రేటింగ్ ఢమాల్

సోషల్ మీడియా యాప్స్ లో టిక్ టాక్ కి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇండియాలోనే ఎక్కువ సంఖ్యలో టిక్ టాక్ యూజర్స్ ఉన్నారు.

 Tiktok's App Rating Falls Dramatically, Indians Call For Ban, Social Media, Lock-TeluguStop.com

చాలా మంది టిక్ టాక్ వీడియోలు చేస్తూ సెలబ్రిటీలుగా మారిపోయారు.అయితే టిక్ టాక్ రేంజ్ లోనే యూట్యూబ్ కి కూడా మంచి క్రేజ్ ఉంది.

చాలా మంది యుట్యూబ్ లో చానల్స్ నడుపుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ రెండు యాప్ యూజర్స్ మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వార్ నడుస్తుంది.

ఒకే ఒక్కడు పిలుపుతో ఇప్పుడు ఈ సోషల్ మీడియా వార్ లో టిక్ టాక్ రేటింగ్ అమాంతం పడిపోయింది.యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌ ప్రస్తుతం ఫుల్ ట్రెండ్ లో ఉన్న సోషల్ వార్.

ఎల్విష్ యాద‌వ్ అనే యూట్యూబ‌ర్ టిక్‌టాక్ యూజ‌ర్ల‌ను చెత్త‌తో పోలుస్తూ ఓ వీడియో చేశాడు.దీంతో ఆగ్ర‌హం చెందిన అమీర్ సిద్ధిఖీ అనే టిక్‌టాక్ యూజ‌ర్‌ యూట్యూబర్లకు ఏదీ చేత కాదంటూ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడాడు.

ఇది విన్నాక యూట్యూబ‌ర్లు రెచ్చిపోయి టిక్‌టాక‌ర్ల‌ను చెడుగుడు ఆడుకోవడం మొదలెట్టారు.ముఖ్యంగా స్టార్ యూట్యూబ‌ర్ క్యారీమినటీ‌.అత‌ను మే 8న “యూట్యూబ్ వ‌ర్సెస్ టిక్‌టాక్‌” పేరిట‌ అప్‌లోడ్ చేసిన‌ రోస్టింగ్‌ వీడియోకు వ‌చ్చిన లైకులు, కామెంట్లు, వ్యూస్ ప్ర‌తీది రికార్డే.అయితే ఎన్నో ప్ర‌పంచ రికార్డుల‌ను సొంతం చేసుకున్న వీడియో మే 14 నుంచి యూట్యూబ్‌లో క‌నిపించ‌కుండా పోయింది.

ఊహించ‌ని ప‌రిణామంతో క్యారీమిన‌టి క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి.క్యారీమిన‌టి వీడియో డిలీట్ చేయ‌డానికి కార‌ణ‌మైన టిక్‌టాక్‌ను ఊరుకునేది లేద‌ని సోష‌ల్ మీడియాలో మంగ‌మ్మ‌ శ‌ఫ‌థం చేశారు.

ఈ మేర‌కు టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకుని చీప్ రేటింగ్ ఇచ్చి డిలీట్ చేయాల‌ని ఓ ఉద్య‌మ‌మే న‌డిపారు.దీంతో 4.6తో టాప్‌లో ఉన్న టిక్‌టాక్ రేటింగ్ ఇప్పుడు రెండుకు దిగ‌జారిపోయింది.ఓ విధంగా టిక్ టాక్ యాప్ కి మార్కెట్ మీద ఈ రేటింగ్ విపరీతమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube