ఓరి దేవుడా.. టిక్ టాక్ స్టార్ దుర్గారావు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

సోషల్ మీడియా ప్రేక్షకులకి టిక్ టాక్ ద్వారా పరిచయమైన దుర్గారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తన వెరైటీ డాన్స్ స్టెప్పులతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించిన ఆయన ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా తన నృత్య ప్రదర్శనలతో తెలుగు ప్రేక్షకుల దగ్గరికి వస్తున్నాడు.

 Tik Tok Star Durga Rao Monthly Income Details, Tik Tok Star Durga Rao, Dancers,-TeluguStop.com

దుర్గారావు నాట్యమండలి పేరుతో దుర్గా రావు దంపతులు చేసే డాన్స్ లో ఎంతో ఫేమస్ అయ్యారు.వీరిద్దరికీ టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ స్టేటస్ వచ్చిందని చెప్పవచ్చు.

టిక్ టాక్ ఉన్న సమయంలో వీరికి లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.దుర్గారావు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పలాస సినిమాలోని “నాది నక్కిలీసు గొలుసు” అనే పాటకు వేసిన స్టెప్పులు ఎంతగానో ఫేమస్ అయ్యాయి.

వారు చేసినందుకే ఈ పాటకు ఎక్కడలేని ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు.అంతేకాదు వీరిద్దరూ చేసిన డ్యాన్స్ కు ఇమిటేట్ చేస్తూ ఢీ షో లో కూడా డాన్సర్స్ వీరి స్టైల్ ను అనుకరిస్తూ డాన్స్ చేయడం నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే.

ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ స్కిట్ ద్వారా దుర్గా రావు దంపతులు జబర్దస్త్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత జీ తెలుగులో ప్రసారమయ్యే అదిరింది షో లో కూడా దుర్గారావు ప్రత్యక్షమయ్యాడు.

ఆ తర్వాత మళ్ళీ జబర్దస్త్ షోలో హైపర్ ఆది స్కిట్ లో దంపతులిద్దరూ ప్రత్యక్షమయ్యారు.అలాగే ఈ టీవీ లోనే ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాంలో కూడా ఈ జంట కనబడింది.

ఇక వీరిద్దరూ యూట్యూబ్లో ప్రారంభించిన యూట్యూబ్ ఛానల్ ద్వారా వీరు చేసే వీడియోలు అన్ని అందులో పోస్ట్ చేయడం ద్వారా వారికి మంచి వ్యూస్ లభిస్తున్నాయి.ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ సడలింపు కారణంగా అక్కడ అక్కడ జరుగుతున్న ఈవెంట్స్ లో కూడా వీరు పాల్గొంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఎందరో దుర్గారావు అభిమానులు వారిని ఈవెంట్స్ కోసం ఆహ్వానిస్తున్నారు.

ఈ దెబ్బతో దుర్గారావు ఆదాయం వేల నుంచి లక్షలకు చేరిందని సమాచారం.

ఇదివరకు దుర్గారావు కేవలం బట్టలు కుడుతూ జీవనోపాధి పొందుతున్న ఆయన ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ గా మారిపోయారు.దుర్గారావు స్టార్డం ఇప్పుడు ఎలా ఉందంటే కొన్ని బ్రాండ్ ప్రమోషన్స్ ఇచ్చే స్థాయికి ఎదగడం అంటే సోషల్ మీడియా ఆయనని ఏ రేంజ్ లో కూర్చోబెట్టిందో అర్థమవుతుంది.

అందిన సమాచారం మేరకు యూట్యూబ్ ఛానల్ నుండి అతనికి ప్రతినెల 50 వేల రూపాయల ఆదాయం వస్తుందట.అంతేకాకుండా అతడు చేసే ప్రమోషన్స్ ద్వారా కూడా మరింత ఆదాయం ఆయనకు చేకూరుతుంది.

ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా ఇంత పాపులారిటీ సంపాదించడం అంత సులువైన విషయం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube