టిక్‌టాక్‌కు ధీటుగా ‘బిస్కెట్‌’.!

భారత్ దెబ్బకు చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్‌ చతికలపడిన సంగతి అందరికీ తెలిసినదే.దేశ భద్రతా దృష్ట్యా.

 New Biscuit App Launched, China Apps Banned,tik Tok, Biscuit App, India, China,-TeluguStop.com

ప్రముఖుల డేటాను తస్కరిస్తుందనే ఆరోపణలతో టిక్‌టాక్‌కు ఈ గతి పట్టింది.అలాగే అమెరికా కూడా ఈ యాప్ పైన కదం తొక్కిన సంగతి తెలిసినదే.

ఈ క్రమంలోనే వరుసగా పలు దేశాలు చైనా యాప్ ల పైన దృష్టిని కేంద్రీకరించాయి.ఇకపోతే ఎప్పుడైతే ఇండియాలో టిక్ టాక్ బాన్ అయ్యిందో.

సరిగ్గా అప్పడినుండి దానికి ప్రత్యామ్నాయ యాప్ లు మార్కెట్ లోకి వచ్చాయి.

టిక్ టాక్ ను పోలిన ‘ఛట్‌పట్‌’ అనే యాప్ ను నెలరోజుల క్రితం తెలంగాణ యువకుడు రూపొందిన విషయం అందరికి విదితమే.

టిక్ టాక్ ను భారత్ బ్యాన్ చేసిన క్రమంలో చట్‌పట్‌ కు కూడా ప్లేస్టోర్‌ లో మంచి డిమాండ్‌ ఏర్పడింది.ఇక టిక్ టాక్ బ్యాన్ అయిన ఒక్కరోజు వ్యవధిలోనే ఈ యాప్‌ ప్లే స్టోర్‌ ట్రెండింగ్‌ సోషల్‌ క్యాటగిరీలో టాప్‌-10 లో నిలవడం గమనార్హం.

వికారాబాద్‌ జిల్లా పరిధిలోని నవాబు పేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌ అనే 30 ఏళ్ళ యువకుడు ఈ ‘చట్‌పట్’‌ యాప్‌కు రూపకల్పన చేయడం హర్షణీయం.

ఇకపోతే.

పెద్దపల్లి జిల్లాకు చెందిన కొందరు యూత్ టిక్ టాక్ కు ధీటుగా ఓ యాప్‌ ను సృష్టించారు.దీనికి బిస్కెట్‌ అనే నామకరణం చేశారు.

కాగా ఈ యాప్‌ లోగోను పాలకుర్తి జెడ్పీటీసీ అయినటువంటి కందుల సంధ్యా రాణిగారు నిన్న శుక్రవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “మన పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకులు ఎంతో కష్ట పడి టిక్ టాక్ ను తలదన్నేలా అద్భుతమైన ఫీచర్స్‌ కలిగిన బిస్కెట్‌ యాప్ ను రూపొందించారు.

దీనిలో టిక్ టాక్ కంటే భిన్నమైన అప్ డేటెడ్ ఫీచర్స్ ఉన్నాయి.దయచేసి అందరు కూడా ఈ సర్వీస్ ని వినియోగించుకోగలరు అని అన్నారు.ఈ సందర్భంగా సదరు టీమ్ ను ఆమె అభినందించారు.కాగా ఈ కార్యక్రమంలో బిస్కెట్‌ యాప్‌ ఆవిష్కర్తలు అయినటువంటి సాయికుమార్, సత్యాన్వేష్, రంగు శ్రీనివాస్‌గౌడ్, దుర్గేష్, ప్రణయ్‌ మొదలగువారు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube