భారత్ దెబ్బకి టిక్‌టాక్ సీఈవో రాజీనామా..!

అవును.భారత్ దెబ్బకి టిక్‌టాక్ కుదేలుమంది.

 Tiktok Ceo Kevin Mayor Resigns To His Job  Tiktak, Short Video, Resign, Ceo, Ind-TeluguStop.com

దాంతో టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కెవిన్ మేయర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు.కాగా.

ప్ర‌స్తుత జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ వెనెస్సా పప్పాస్ తాత్కాలిక సీఈఓ గా కొన‌సాగ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ప్రపంచ వ్యాప్తంగా కోట్ల సంఖ్యలో యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్ ‌టాక్ ‌కు ఇటీవలి కాలంలో చేదు అనుభవాలు మొదలయ్యాయి.

భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌ టాక్ సహా 59 చైనా యాప్ ‌లను కేంద్రం నిషేదించిన సంగతి అందరికీ తెలిసినదే.యూజర్ల డేటా భద్రతా విషయంలో టిక్‌ టాక్ పలు విధాలైన వివాదాలను మూటకట్టుకుంది.

విదేశాలకు చెందిన పలు సోషల్ డేటా కంపెనీలకు సమాచారాన్ని అమ్ముకుంటోంది అనే ఆరోపణలు వున్నాయి.ఈ నేపథ్యంలోనే టిక్‌ టాక్ కు బాడ్ టైం స్టార్ట్ అయ్యింది.

భారత్ తరువాత అమెరికా చైనా పైన విరుచుకుపడింది.

ఇటీవల ట్రంప్ టిక్ ‌టాక్ కు ఈ విషయమై ఓ డెడ్ లైన్ కూడా ప్రకటించాడు.

అమెరికాలో టిక్ ‌టాక్ వాడకంపైన 90 రోజుల గడువు కూడా విధించాడు.ఇప్ప‌టికే ప‌లు దేశాలు భారత్ ను అనుసరించి టిక్‌ టాక్‌ ను నిషేదించాయి.

ఇకపోతే, బయటకు వ్యక్తం చేయకపోయినా, క‌రోనా వైర‌స్ కు పురుడు పోసిన చైనా పైన ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి.ఇప్ప‌టికే పలు దేశాలు చైనాతో వ్యాపార ఒప్పందాల‌ను తెగ‌దెంపులు చేసుకున్నాయి.

భారత్ అయితే దాదాపుగా చైనాతో వ్యాపార లావాదేవీలను కట్ చేసేసింది.ఇలాంటి పరిస్థితులలో టిక్ ‌టాక్ సీఈఓ రాజీనామా చేయ‌డం ట్రేడ్ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube