ఇండియాలోనే కాదు పలు దేశాల్లో కూడా టిక్‌టాక్‌పై నిషేదం... వ్యతిరేకతకు ప్రధాన కారణం ఇదే  

Tiktok Banned By Google And Apple For Indian Users-

గత కొన్ని రోజులుగా తమిళనాడులో టిక్‌టాక్‌ను నిషేదించాల్సిందే అంటూ కొందరు ప్రజా ప్రతినిథులు డిమాండ్‌ చేస్తున్న విషయం తెల్సిందే. టిక్‌టాక్‌ నిషేదంపై సుప్రీం కోర్టు కూడా కేంద్రంను ఆదేశించిన నేపథ్యంలో ఇండియాలో టిక్‌ టాక్‌ను నిషేదించినట్లుగా గూగుల్‌ మరియు యాపిల్‌ ప్రకటించాయి. చెన్నై హైకోర్టు టిక్‌టాక్‌ను నిషేదిస్తూ ఆదేశాలు జారీ చేయడం, ఆ నిషేదంను సుప్రీం కోర్టు సమర్ధించడంతో పాటు, కేంద్ర సమాచార శాఖ టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుండి తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసిన వెంటనే గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుండి టిక్‌టాక్‌ను తొలగించడం జరిగింది...

ఇండియాలోనే కాదు పలు దేశాల్లో కూడా టిక్‌టాక్‌పై నిషేదం... వ్యతిరేకతకు ప్రధాన కారణం ఇదే-TikTok Banned By Google And Apple For Indian Users

టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ చాలా మంది గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పుడు వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే టిక్‌టాక్‌ను మొబైల్‌లో ప్రస్తుతం వాడుకుంటున్నట్లుగా వాడేసుకోవచ్చు.

ప్లే స్టోర్‌ నుండి తొలగించారే తప్ప మొత్తంగా తొలగించలేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి. టిక్‌టాక్‌ తమ యాప్‌ను నిలిపేస్తే తప్ప దాన్ని మీ మొబైల్‌ నుండి ఎవరు కూడా తొలగించే అవకాశం లేదు.

టిక్‌టాక్‌ ఇప్పటికే వాడుతున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడేసుకోవచ్చు. కొత్తగా కావాలనుకునే వారు షేర్‌ ఇట్‌ ద్వారా వేరే వారి మొబైల్‌లో ఉన్న యాప్‌ను షేర్‌ చేసుకోవచ్చు.

ఇక టిక్‌టాక్‌ను ఇండియాలోనే కాకుండా పలు ప్రపంచ దేశాల్లో కూడా బ్యాన్‌ చేయడం జరిగింది. ముఖ్యంగా బంగ్లాదేష్‌ మరియు ఇండోనేషియాలో టిక్‌టాక్‌పై చాలా రోజుల నుండే నిషేదం కొనసాగుతుంది.

ఇండియాలో ఇప్పుడు బ్యాన్‌ చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడం వల్ల హక్కులను హరించడమే అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయడం మంచిదే అని, యువత చాలా సమయం టిక్‌టాక్‌ అంటూ వృదా చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు...

ఇక ఇండియాలో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ పలువురు చనిపోయారు. కొందరు ప్రమాదంలో చిక్కుకున్నారు. దాంతో పాటు మన సాంప్రదాయానికి విరుద్దంగా వీడియోల్లో చిల్లర పనులు చేస్తున్నారు. ఆ కారణంగానే టిక్‌టాక్‌ను నిషేదించాలనే డిమాండ్‌ మొదట తమిళనాట మొదలైంది.

ఇప్పుడు దేశ వ్యాప్తంగా అమలు అయ్యింది. టిక్‌టాక్‌పై ఇంతకు మించి చర్యలు తీసుకుంటారా, ప్లేస్టోర్‌లో బ్యాన్‌తో వదిలేస్తారా అనేది చూడాలి.