వీడియో కోసం పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన పేరెంట్స్! టిక్ టాక్ వీడియో వైరల్  

టిక్ టాక్ లో ఫేమస్ అవడం కోసం పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన పేరెంట్స్. .

Tiktok Video Viral And Controversy-social Media,tiktok Ban,tiktok Video,viral

టిక్ టాక్ పై కేంద్రం నిషేధం ఎందుకు విధించింది అనే విషయం కొన్ని వీడియోలు చూసినపుడు తెలుస్తుంది. ఎక్కువగా మహిళలు, యూత్ ని భాగా ఎట్రాక్ట్ చేసిన ఈ టిక్ టాక్ వీడియోలో పబ్లిసిటీ కోసం వారు చేసే పనులు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఓ టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది..

వీడియో కోసం పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన పేరెంట్స్! టిక్ టాక్ వీడియో వైరల్-TikTok Video Viral And Controversy

టిక్ టాక్ పిచ్చి పీక్ స్టేజ్‌కి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. టిక్ టాక్‌లో ఫేమస్ అవడం కోసం ఓ జంట బావగారూ బాగున్నారా సినిమాలో సీన్‌ను వీడియో కోసం ట్రై చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం చనిపోయాడని భావించిన హీరోయిన రంభ.

అతడిని ఫ్రిజ్‌లో పెడుతుంది. ఆ తర్వాత చిరంజీవి వచ్చి ఫ్రిజ్‌లో ఉన్న మనిషిని బయటకు తీస్తాడు.

ఈ జంట కూడా సేమ్ టు సేమ్ అలాగే చేసింది. ఇందులో బ్రహ్మానందం క్యారెక్టర్‌లో తమ కొడుకుని పెట్టింది. ఆ ఫ్రిజ్ లో పిల్లాడిని పెట్టడంతో వాడు చలికి ఫ్రీజ్ అయిపోయాడు.

ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారగా. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పశాచిక ఆనందం కోసం పిల్లని బాలి చేస్తారా అంటూ వారిని నెటిజన్ లు విమర్శిస్తున్నారు.