దారుణం : టిక్ టాక్ వీడియో చూసి కరోనా రాదని ద్రావణం తాగారు....చివరికి...

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న సంఘటన అందరికీ తెలిసిందే.దీంతో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కరోనా వైరస్ గురించి పలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

 Tik Tok Vide, Four People Hospitalized, Chittoor, Corona Virus, False News,-TeluguStop.com

అయితే ఈ అసత్య వార్తలను నమ్మి ఆచరిస్తున్నటువంటి కొందరు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.తాజాగా ఉమ్మెత్త పువ్వుల ద్రావణం తాగితే కరోనా రాదని కొందరు టిక్ టాక్ వీడియో చూసి ఉమ్మెత్త పూల విత్తనాల ద్రావణాన్ని తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాకి  చెందినటువంటి చీమకుర్తి ప్రాంతంలో సుశీల అనే 60 సంవత్సరాలు కలిగిన ఓ వృద్ధురాలు నివాసం ఉంటోంది.అయితే ఈ వృద్ధురాలు అప్పుడప్పుడు కాలక్షేపం కోసం టిక్ టాక్ వీడియోలను చూస్తుండేది.

ఈ క్రమంలో ఉమ్మెత్త పువ్వుల ద్రావణం తాగితే కరోనా వైరస్ సోకదు అంటూ ఓ వీడియోను టిక్ టాక్ లో  చూసింది.దీంతో తాను కూడా ఉమ్మెత్త పువ్వుల ద్రావణం సేవించాలని అనుకుంది.

అనుకున్నదే తడవుగా ఉమ్మెత్త పువ్వులను సేకరించి గింజలను తీసి ద్రావణం చేసి తాగింది.అలాగే తనతో పాటు తన చుట్టుపక్కల ఉన్న మరో ఆరుగురికి కూడా తాగించింది.

దీంతో ఒక్కసారిగా ఉమ్మెత్త పువ్వు ద్రావణం సేవించినటువంటి వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఇది గమనించినటువంటి స్థానికులు వెంటనే బాధితులను దగ్గర ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

దీంతో వైద్యులు సకాలంలో స్పందించి సరైన చికిత్సను అందించడంతో వెంటనే బాధితులు కోలుకున్నారు.అంతేగాక ఈ విషయంపై వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా మాధ్యమాల్లో వస్తున్నటువంటి అసత్య వార్తలను నమ్మద్దని మరియు వైద్యులను సంప్రదించకుండా ఎటువంటి మందులను తీసుకోవద్దంటూ ప్రజలకు సూచిస్తున్నారు.ఒకవేళ తమ ప్రాంతాల్లో ఎవరైనా కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారాలు గాని లేదా మందు కనిపెట్టినట్లు ఏవైనా మందులు అమ్ముతున్నారనిగాని గమనిస్తే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించాలని స్థానికులను పోలీసులు కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube