టిక్ టాక్ ప్రో మెసేజ్ వచ్చిందా...? జాగ్రత్త గురూ...!

గాల్వాన్ ఘర్షణ నేపథ్యంలో భారతదేశంలో చైనా కు సంబంధించిన యాభై తొమ్మిది యాప్స్ ను బ్యాన్ చేసిన సంగతి విదితమే.అయితే కొన్ని భద్రత కారణాల వల్ల వీటిని బ్యాన్ చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.

 Have You Recived Tiktak Pro Message, Just Be Attention, Tik Tok , Tik Tok Pro, C-TeluguStop.com

ఈ నేపథ్యంలో ప్రముఖ యాప్ టిక్ టాక్ కూడా బ్యాన్ అయ్యింది.అయితే ఇప్పుడు ఆ టిక్ టాక్ పేరుతో మరో టిక్ టాక్ ప్రో అంటూ మెసేజ్ అందరికీ వస్తోంది.

అయితే ఆ మెసేజ్ లో టిక్ టాక్ బదులు టిక్ టాక్ ప్రో అని వస్తోంది.భారతదేశంలో టిక్ టాక్, మరోసారి టిక్ టాక్ ప్రో రూపంలో అందుబాటులోకి వచ్చిందని మెసేజ్ వస్తుంది.

అయితే దీన్ని ఎవరూ నమ్మవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒకవేళ మీకు కూడా ఇలాంటి మెసేజ్ వస్తే దాన్ని డిలీట్ చేయండి.

అధికారిక టిక్ టాక్ యాప్ భారతదేశంలో బ్లాక్ అయిన తర్వాత సైబర్ క్రిమినల్స్ ఎస్ఎంఎస్ ద్వారా టిక్ టాక్ ప్రో అనే మెసేజ్ ను పంపి దానితో మీ ఫోన్లో మాల్వేర్ ను ఇన్స్టాల్ చేస్తున్నారు.మీరు పొందిన ఆ మెసేజ్ నిజంగా టిక్ టాక్ నుంచి వచ్చిందని అనుకొని ఒకవేళ డౌన్ లోడ్ చేస్తే మాత్రం అక్కడ మాత్రం ఒరిజినల్ టిక్ టాక్ మాదిరి కనపడుతుంది.

అయితే దాని వెనుక మాత్రం మీ కెమెరా, ఇమేజ్, గ్యాలరీ, మైక్ వంటి అన్ని అనుమతులను యాక్సిస్ తీసుకుంటుంది.మీరు కానీ ఓకే అని క్లిక్ చేసారో ఇక అంతే సంగతులు.

Telugu Cyber, Facbook, Google, Tik Tok, Tik Tok Pro, Tiktok-

మీ ఫోన్ లోని సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేయడానికి పూర్తి అవకాశాలున్నాయి.వారు మీ సెల్ ఫోన్ కు సంబంధించి అన్ని రకాల యాప్స్ లోకి చొరబడి మీ యొక్క ప్రతి అంశాన్ని తెలుసుకొని మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేలా చేయవచ్చు.ఇకపోతే తాజాగా ఇలాంటి యాప్స్ ఫేస్ బుక్ ను యూజర్ల డేటా కూడా తస్కరించామని సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇవైనా గూగుల్ కు హెచ్చరికలు జారీ చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube