ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ టిక్ టాక్ స్టార్..!

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా చాలా మంచి సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు అయ్యారు.అతి వయసులోనే తమ టాలెంట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలొయింగ్‌ను పెంచుకున్నారు.

 Tik Tok Star, Suside,  Social Media, Famous,comeents,netizens,viral News-TeluguStop.com

మంచి పేరు, ప్రఖ్యాతలు గడించారు.అతి తక్కువ సమయంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించి సక్సెస్‌ను అందుకుని.

సోషల్ మీడియా సెలబ్రిటీలుగా గుర్తింపు పొందారు.వీరిలో కొందరూ సక్సెస్ వైపు అడుగులు వేస్తుంటే.

మరికొందరు మానసిక ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడుతున్నారు.

ప్రముఖ టిక్‌టాక్ స్టార్ డజారియో.

తక్కువ కాలంలోనే స్టార్ గుర్తింపు సంపాదించుకున్నారు.మానసిక ఆందోళనకు గురై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ వార్త కుటుంబ సభ్యులతోపాటు ఫ్యాన్స్‌లను విషాదంలో నెట్టేసింది.అమెరికాలోని బ్యాటన్ రోగ్‌కు చెందిన డజారియాకు 10.5 లక్షల మంది ఫాలొవర్స్ ఉన్నారు.వీడియో పెట్టిన మరుక్షణమే లక్షల్లో వీవ్స్, లైకులు, షేర్లు వస్తాయి.

కాగా, కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో బాధపడుతోంది.దీంతో గత సోమవారం (ఈ నెల 8వ తేదీన) ఆకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంది.

డజారియా ‘డీ’ అనే పేరుతో బాగా పాపులర్ అయింది.పాటలు పాడుతూ.డ్యాన్సులు చేస్తూ బాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, టిక్‌టాక్, య్యూటూబ్ అకౌంట్‌లో షేర్ చేసేది.అలా ఒక వీడియోను పోస్ట్ చేసి.

‘ఇదే నా చివరి వీడియో’ అని చెప్పుకొచ్చింది.

డజారియా తండ్రి రహీమ్ అల్లా మాట్లాడుతూ.

‘‘ చాలా బాధగా ఉంది.నా కూతురి మమ్మల్నీ వదిలి శాశ్వతంగా దూరమైంది.

నా చేతులతో తనని అంత్యక్రియలు చేస్తానని ఊహించలేదు.తను పడుతున్న బాధ గురించి ఏ రోజూ పంచుకోలేదు.

లోలోపలే కుమిలిపోయి.చివరికి ప్రాణాలే విడిచింది.

’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.డజారియా ఇక లేదనే వార్త విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

ఎందుకు చేసుకుందని, ఊహించలేకపోతున్నామని, మా ఫేవరేట్ టిక్ టాకర్‌ను కోల్పోయామని.పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube