టిక్ టాక్ లో ఓవర్ యాక్షన్… బ్యాన్ చేయాలని పెరుగుతున్న డిమాండ్  

Tik Tok Social Media App - Telugu Chiana Apps, Demands To Ban Tik-tok Raised Again, Lock Down, Social Media, Tollywood

ఈ మధ్య కాలంలో యువతులు ఎక్కువగా టిక్ టాక్ కి బానిస అయిపోయారు.కాస్తా టైం దొరికితే టిక్ టాక్ ఓపెన్ చేయడం అందులో ఏదో పిచ్చి పిచ్చిగా వీడియోలు పోస్ట్ చేయడం చేస్తున్నారు.

 Tik Tok Social Media App

ఈ టిక్ టాక్ వ్యామోహం ఇప్పుడు కాపురాలు కూల్చే స్థాయికి వచ్చేసింది.అయిన కూడా మహిళలు ఇందులో వీడియోలు చేస్తూ ఫేమస్ అవ్వాలని ఆశ పడుతున్నారు.

కొంత మంది ఎంత భాగా వీడియోలు చేసిన కూడా టిక్ టాక్ లో తనని ఎవరూ ఫాలో అవడం లేదని, లైక్స్ రావడం లేదనే చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకునేంత వరకు వెళ్ళిపోతున్నారు.మరికొంత మంది పిచ్చిపిచ్చిగా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషాలు వేసుకుంటూ, కొంతమంది తుంటరి పనులు చేస్తూ టిక్ టాక్ సెలబ్రిటీలుగా మారిపోవాలని అనుకుంటున్నారు.

టిక్ టాక్ లో ఓవర్ యాక్షన్… బ్యాన్ చేయాలని పెరుగుతున్న డిమాండ్-General-Telugu-Telugu Tollywood Photo Image

టిక్ టాక్ సెలబ్రిటీలని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం కూడా కొన్ని యుట్యూబ్ చానల్స్ చేస్తున్నాయి.అయితే గత కొంత కాలంగా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్స్ వినిపిస్తున్నాయి.

అలాగే దీనికి వన్ పాయింట్ రేటింగ్ ఇవ్వడం వలన భారీగా రేటింగ్ పడిపోయింది.ఈ నేపధ్యంలో కొంత మంది టిక్ టాక్ ద్వారా మరింత త్వరగా ఫేమస్ అవ్వాలని అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేస్తూ పోలీసులకి చిక్కుతున్నారు.

అలాగే టిక్ టాక్ లో ఎక్కువ వ్యూస్ కావాలని జంతువులని హింసిస్తూ వీడియో షూట్ చేస్తూ కొంత మంది పోస్ట్ చేస్తున్నారు.అలాగే కొంతమంది మరింత వల్గర్ గా బూతులు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు.

ఇవన్ని చూస్తున్న పేరెంట్స్ నుంచి కూడా టిక్ టాక్ బ్యాన్ చేయాలని, దీని వలన తమ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని డిమాండ్ వినిపిస్తుంది.మరి ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test