ఈ ఫోటోలో బాలయ్య బాబు పక్కన ఉన్న చిన్నారి ఎవరో తెలిస్తే అవాక్కవుతారు

తెలుగులో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న అఖండ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా కంచె మూవీ ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ మరియు పూర్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.

 Tik Tok Fame Deeshna Got Chance In Balayya Akhanda Movie, Deeshna, Child Artist,-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు దాదాపుగా అరవై శాతం పూర్తి అయినట్లు సమాచారం.

దీంతో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని ఇటీవలే ఉగాది పర్వదినం రోజున చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఆ మధ్య హోలీ పండుగ సందర్భంగా నందమూరి బాలకృష్ణ ఓ చిన్నారితో కలిసి దిగినటువంటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.దీంతో ఆ చిన్నారి ఎవరా ? అంటూ కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్ లో తేగ వెతుకుతున్నారు.

Telugu Akhanda, Balakrishna, Child Artist, Deeshna, Tiktok, Tollywood-Movie

అయితే హోలీ పండుగ రోజున బాలయ్య బాబుకి రంగులు పూసి నవ్వుల చిందించిన ఆ చిన్నారి పేరు దీష్ణ.కాగా ఈ దీష్ణ అప్పట్లో పలు టిక్ టాక్ వీడియోల ద్వారా బాగానే ఫేమస్ అయ్యింది.ఇందులో భాగంగా టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఖుషి చిత్రం లోని ఓ డైలాగు ద్వారా దీష్ణ బాగా పాపులర్ అయింది.అంతే కాకుండా మరిన్ని పాటలు మరియు డైలాగులు చెబుతూ తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

దీంతో అప్పట్లో దీష్ణ కి టిక్ టాక్ లో దాదాపుగా 10 లక్షల మంది ఫాన్స్ కూడా ఉండేవాళ్ళు.కాగా ఇటీవల దీష్ణతల్లి తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందిస్తూ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ఇందులో భాగంగా తాము కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసముంటున్నట్లు, అంతేకాకుండా తండ్రి వైద్య రంగంలో సేవలు అందిస్తున్నట్లు కూడా తెలిపింది.అలాగే దీష్ణకి అఖండ మొదటి చిత్రమని, అలాగే వచ్చీ రావడంతోనే స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తో నటించే అవకాశం దక్కించుకున్నందుకు చాలా అదృష్టవంతురాలని చెప్పుకొచ్చింది.

ఇక బాలయ్య బాబు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ బాలయ్య బాబు చూడటానికి గంభీరంగా ఉన్నా చిన్నపిల్లల పట్ల మాత్రం చాలా మృదు స్వభావంగా వ్యవహరిస్తాడని తెలిపింది.అంతే కాకుండా తన తోటి నటీనటులతో చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తాడని కూడా చెప్పుకొచ్చింది.

ఈ విషయం ఇలా ఉండగా ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గత కొద్దికాలంగా బాలయ్యబాబు సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.దీంతో ఎలాగైనా “అఖండ” చిత్రంతో హిట్ కొట్టాలని బాగానే శ్రమిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube