టిక్ టాక్ యాప్ ద్వారా తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దుర్గారావ్.టిక్ టాక్ బ్యాన్ కాకముందు ఆయనకు యాప్ లో లక్షల సంఖ్యలో అభిమానులు ఉండేవారు.
అయితే ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షోలో కంటెస్టెంట్ పండు దుర్గారావును, ఆయన భార్యను ఇమిటేట్ చేస్తూ “నాదీ నక్కిలీసు గొలుసు” పాటకు డ్యాన్స్ చేయడంతో దుర్గారావుకు గుర్తింపు వచ్చింది.పండు పాటకు కోట్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.
రికార్డింగ్ డ్యాన్స్ లో వేసినట్టు దుర్గారావు హావభావాలు ఇవ్వడం, ఆయన భార్య తల ఊపుతూ డ్యాన్స్ చెయ్యడం వాళ్లిద్దరికీ గుర్తింపు వఛ్కింది.ఢీ షో ద్వారా వచ్చిన గుర్తింపుతో దుర్గారావు జబర్దస్త్ షోలోని ఒక స్కిట్ లో మెరిశారు.
స్కిట్ లో ఉన్నది కొంత సమయమే అయినా ఛాన్స్ ఇస్తే జబర్దస్త్ షో ద్వారా కూడా ప్రూవ్ చేసుకోగలమని దుర్గారావ్ నిరూపించుకున్నారు.అయితే టిక్ టాక్ బ్యాన్ కావడంతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే దుర్గారావ్ ను ఎంతో నమ్ముకున్న వాళ్లే మోసం చేశారని తెలుస్తోంది.టిక్ టాక్, ఢీ ద్వారా వచ్చిన పాపులారిటీతో దుర్గారావు కొన్ని కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా క్రేజ్ మరింత పెంచుకుందామని అనుకున్నాడు.ఇప్పటికే ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేశాడు.అయితే ఆ మ్యూజిక్ ఆల్బమ్ గురించి సెలబ్రిటీలు ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఆ మ్యూజిక్ ఆల్బమ్ కు అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.దీంతో దుర్గారావు క్రేజ్ తగ్గుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అభిమానులను నమ్ముకుని కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే అభిమానులే ముంచేశారని దుర్గారావు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.అయితే కొందరు మాత్రం దుర్గారావు స్టెప్పులు రొటీన్ అవుతున్నాయని అందువల్లే అతనికి క్రేజ్ తగ్గుతోందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.