టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా మన హైదరాబాద్ యాప్...!

ప్రస్తుతం భారతదేశంలో చైనాపై ఆగ్రహజ్వాలలు ఓ రకంగా కొనసాగుతూనే ఉన్నాయి.ఇందులోనే భాగంగానే చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను భారత ప్రభుత్వం నిషేధించిన సంగతి విదితమే.

 One More App Trending For Replacing Of Tik Tak In India, Tik Tok, Dubshoot, Hyde-TeluguStop.com

అందులో ప్రముఖమైన టిక్ టాక్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.అన్ని యాప్స్ భారతదేశంలో ఒకటే సారిగా బ్యాన్ చేయడంతో చైనా దేశానికి ఆర్థికంగా పెద్ద దెబ్బ తీసినట్లైంది.

ఇక టిక్ టాక్ విషయానికి వస్తే టిక్ టాక్ స్టార్స్ గా పేరు పొందిన వారికి అయితే ప్రస్తుతం చేతులు, కాళ్లు కట్టేసినట్టుగా ఉంది వారికి.

ఇక ఇదే సమయంలో భారత దేశంలో టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా మరో యాప్ ప్రజాదరణ పొందుతోంది.

దాని పేరే డబ్ షూట్.ఈ యాప్ ప్రస్తుతం టిక్ టాక్ కు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో కొనసాగుతుంది.

టిక్ టాక్ కు ప్రత్యేకంగా ప్లే స్టోర్లో వెతుకుతున్న వారికి ఈ యాప్ ఓ వరంగా మారిందని చెప్పవచ్చు.అయితే ఈ డబ్ షూట్ ను మన హైదరాబాద్ కంపెనీ ఎమ్.హెచ్ డెవలప్ చేసింది.ప్రస్తుతం ఈ యాప్ భారతదేశంలో ఫేవరేట్ వీడియో షేరింగ్ గా మారిపోయింది.

మరోవైపు చింగారి యాప్ కూడా ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

తాజాగా డబ్ షూట్ ఆప్ కూడా ప్లే స్టోర్ లో అనేక డౌన్లోడ్స్ నానాటికి పెరుగుతూ వెళుతున్నాయి.

ఇక ఈ యాప్ లో బాలీవుడ్, టాలీవుడ్, కాలివుడ్ మాత్రమే కాకుండా మిగతా సినిమా రంగాలకు సంబంధించి ఫన్నీ డైలాగ్స్, క్లిప్స్ వంటివి ఉన్నాయి.ఈ యాప్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

అంతే కాకుండా ఇందులోని ఆడియో క్లిప్ ను వాట్సాప్ ద్వారా మీ స్నేహితులకు షేర్ చేసుకోవచ్చు.వీటితో పాటు అనేక వేల కొత్త వీడియోలు రోజు అందుబాటులోకి వస్తున్నాయి.

టిక్ టాక్ లో ఎలాగైతే కొత్తగా సెల్ఫీ వీడియో ని రికార్డ్ చేసి వీడియోను తయారు చేస్తున్నాను అలాగే ఇక్కడ కూడా తయారు చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube