చంద్రబాబు బాడీగార్డ్స్ తో కలిసి సెల్ఫీలు దిగాను.. భార్గవ్ సంచలన వ్యాఖ్యలు..?

టిక్ టాక్ ద్వారా, యూట్యూబ్ వీడియోల ద్వారా భార్గవ్ మంచి గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఒక మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడనే ఆరోపణలపై పోలీసులు భార్గవ్ ను అరెస్ట్ చేశారు.

 Tik Tok Bhargav Sensational Comments About Filed Case In Interviews-TeluguStop.com

తాజాగా భార్గవ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూలో భార్గవ్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తన గురించి నమోదైన కేసు విషయంలో బయట జరిగిన ప్రచారం తప్పని భార్గవ్ అన్నారు.

తన ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా ఉండాలని తాను కోరుకుంటున్నానని భార్గవ్ చెప్పుకొచ్చారు.జైలు జీవితం గురించి భార్గవ్ స్పందిస్తూ ఆ సమయంలో తనకు చనిపోవాలని అనిపించిందని చెప్పుకొచ్చారు.

 Tik Tok Bhargav Sensational Comments About Filed Case In Interviews-చంద్రబాబు బాడీగార్డ్స్ తో కలిసి సెల్ఫీలు దిగాను.. భార్గవ్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఏ తప్పు చేయలేదని ఆ రీజన్ వల్లే తనకు త్వరగా బెయిల్ మంజూరైందని భార్గవ్ తెలిపారు.జైలు లైఫ్ నుంచి ఎవరినీ అతిగా నమ్మకూడదనే విషయాన్ని అర్థం చేసుకున్నానని భార్గవ్ చెప్పుకొచ్చారు.

ఒక మనిషి గురించి పూర్తిగా తెలుసుకోకుండా అతను మంచి వాడో చెడ్డవాడో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని భార్గవ్ తెలిపారు.తనతో ఉన్నవాళ్లకు మాత్రమే తానంటే ఏంటో తెలుసని పేర్కొన్నారు.

తనను సోషల్ మీడియాలో ఎవరు ట్రోల్ చేస్తారో వాళ్ల గురించి తాను అస్సలు పట్టించుకోననని సోషల్ మీడియాలో మాత్రమే తనపై నెగిటివిటీ ఉందని భార్గవ్ చెప్పారు.తనను బయటివ్యక్తులు మాత్రం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారని భార్గవ్ చెప్పుకొచ్చారు.

Telugu Ex Cm Chandrababu Naidu, Filed Case, Interviews, Tik Tok-Movie

తాను టీ తాగడానికి వెళ్లిన సమయంలో టీస్టాల్ ఓనర్ తనతో సెల్ఫీ దిగాడని భార్గవ్ తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర పని చేసే సెక్యూరిటీ గార్డులు సైతం తనతో సెల్ఫీలు దిగారని భార్గవ్ చెప్పుకొచ్చారు.అయితే నెటిజన్లు మాత్రం భార్గవ్ ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

#Filed Case #Tik Tok #Interviews #ExCM

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు