అయ్య బాబోయ్.. టిక్ టాక్ మన సమాచారం మొత్తం కాపీ చేసేస్తుందిగా …!  

Tik Tok App Personal Data Copy Iphone - Telugu Iphone Uses, Personal Data Copy, Tik Tok, Tik Tok App, Tik Tok App Copying Personal Data, Twitter

ప్రస్తుతం దేశంలో చైనా కు సంబంధించిన ఉత్పత్తులను, అలాగే చైనా సంబంధించిన మొబైల్ యాప్స్ ను నిషేధించండి అంటూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సంగతి విదితమే.ఇదే నేపథ్యంలో చైనా దేశానికి సంబంధించిన బైట్ డాన్స్ మాతృ సంస్థకు చెందిన టిక్ టాక్ వారి యూజర్ల సమాచారాన్ని మొత్తం కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్ ios 14 సాఫ్ట్‌వేర్ బట్టబయలు చేసింది.

 Tik Tok App Personal Data Copy Iphone

టిక్ టాక్ లో మనం ఎటువంటి సమాచారాన్ని అందించిన దాన్ని మొత్తం టిక్ టాక్ కాపీ చేస్తున్నట్లు రుజువైంది.

ఇందులో యూజర్ కి సంబంధించి కొన్ని ఈ మెయిల్స్, అలాగే పాస్వర్డ్ లాంటి గోప్యమైన సమాచారాన్ని కూడా కాపీ చేస్తోంది.

అయ్య బాబోయ్.. టిక్ టాక్ మన సమాచారం మొత్తం కాపీ చేసేస్తుందిగా …-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదివరకు కూడా కేవలం టిక్ టాక్ మాత్రమే చాలా హై ప్రొఫైల్ యాప్ వినియోగదారుల డేటాని కాపీ చేస్తూ అడ్డంగా దొరికింది.దానికి సంబంధించి ఏప్రిల్ నెలలోనే వాటిని ఆపేస్తామని ప్రకటించిన టిక్ టాక్ ఇప్పటివరకు దాన్ని ఆచరణలోకి తీసుకురాలేదని, అది కాస్త ఇప్పుడు ఐఫోన్ 14 ios డెమో వెర్షన్ లో బయటపడింది.

ఇక ఈ సమస్యకు సంబంధించి ios క్లిప్ బోర్డ్ ఫంక్షన్ లో ఓ వినియోగదారుడు తన ఫోన్ లో ఏదైనా యాప్ నుండి ఒక ఇమేజ్, టెక్స్ట్ ను కాపీ చేసి మరో యాప్ లో పేస్ట్ చేయబోగా దీనిని గుర్తించాడు.అంతేకాదు ఒక యాపిల్ సంస్థ పరికరం నుండి మరో ఆపిల్ సంస్థకు సంబంధించిన పరికరం లోకి కూడా కాపీ చేసినప్పుడు దీనిని గమనించాడు.

మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే… ఉదాహరణకు ఐఫోన్ నుండి మ్యాక్ లేదా కంప్యూటర్ లోకి కాపీ చేసినప్పుడు అనమాట.అయితే ఈ కొత్త ios సాఫ్ట్‌వేర్ మన ఫోన్ లోని ఏదైనా యాప్ ఇమేజ్, టెక్స్ట్, డేటాను కాపీ చేస్తుంటే వాటిని గుర్తించి వినియోగదారునికి తెలుపుతోంది.

ఇక ఈ విషయాన్ని జెర్మే బర్గ్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test