టిక్ టాక్ కి ప్రత్యామ్నాయం…ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!!  

Donald Trump Comments On Tik Tok Ban, Tik Tok, America, India, Chaina Apps, Trump, Microsoft, American Apps, - Telugu America, American Apps, Chaina Apps, India, Microsoft, Tik Tok, Trump

ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలలో టిక్ టాక్ పై బ్యాన్ విధిస్తున్న విషయం విధితమే.భారత్ టిక్ టాక్ పై నిషేధం విధించాగానే వరుసగా అన్ని దేశాలు భారత్ బాటలో నడిచాయి.

 Tik Tok America India Chaina Apps Trump Microsoft American Apps

ఈ క్రమంలోనే అగ్ర రాజ్యం అమెరికా కూడా చైనా యాప్స్ పై నిషేధం దిశగా అడుగులు వేస్తోంది.ఈ యాప్ ని నిషేధించాలని ఇప్పటికే అమెరికాలోని పలువురు సెనేటర్లు చట్టసభలో చర్చలు కూడా తీసుకువచ్చారు.

మరో పక్క ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ట్రంప్ టిక్ టాక్ యాప్ ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

టిక్ టాక్ కి ప్రత్యామ్నాయం…ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

చైనా అమెరికాలో మధ్య వాణిజ్యపరమైన గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

చైనా యాప్స్ అమెరికా పౌరుల, అమెరికా సమాచారాన్ని ఈ యాప్స్ ద్వారా చైనాకి చేరవేస్తున్నట్టుగా భావిస్తున్నారు.దాంతో అమెరికా ఈ యాప్స్ అన్నిటిపై వేటు వేయడానికి సిద్దమయ్యింది.

ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ టిక్ టాక్ యాప్ పై నిషేధించడానికి తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఒక వేళ టిక్ టాక్ ని నిషేధించాల్సి వస్తే అందుకు ప్రత్యామ్నాయాన్ని కూడా తప్పకుండా కనుగొంటామని వెల్లడించారు.అయితే

అమెరికా లో ఉన్న టిక్ టాక్ కార్యకలాపాల నిర్వహణ భాద్యతలు హక్కులని సొంతం చేసుకునేందుకు టిక్ టాక్ మాత్రు సంస్థ అయిన బైట్ డాన్స్ తో అమెరిక సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.ఈ పరిణామాల నేపధ్యంలోనే ట్రంప్ తాజాగా వ్యాఖ్యలు ఎంతో ఆసక్తిని రేపుతున్నాయి.ఈ ఘటనలపై స్పందించిన టిక్ టాక్ యాజమాన్యం తమని ఇప్పటి వరకూ ఎవరూ సంప్రదించలేదని అయితే తాము సంస్థని ఎవరికీ అప్పగించడానికి సిద్దంగా కూడా లేమని తేల్చి చెప్పింది.

#India #American Apps #America #Microsoft #Tik Tok

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tik Tok America India Chaina Apps Trump Microsoft American Apps Related Telugu News,Photos/Pics,Images..