ఎలాంటి తప్పిదం జరగకుండా, మాక్ ఉరి కార్యక్రమం లో బిజీ అయిన తీహార్ జైలు అధికారులు

నిర్భయ కేసులో నలుగురు దోషులకు పటియాలా హౌస్ కోర్టు జనవరి 22 వ తేదీన ఉరితీయాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ తేదీకి ముందే మాక్ ఉరి కార్యక్రమం చేపట్టేందుకు తీహార్ జైలు అధికారులు నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో బుధవారం నుంచి అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు.2012 లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో నిందితులకు ఇప్పటివరకు శిక్షలను ఖరారు చేయలేదు.అయితే తాజాగా పటియాలా హౌస్ కోర్టు మిగిలిన ఆ నలుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించడం తో తీహార్ జైలు అధికారులు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టారు.

 Tihar Police Doing Machanging Test-TeluguStop.com

Telugu Mukeshpawan, Nirnhaya, Patiyala, Sathishkumar, Tihar, Tiharmac-

నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకూ జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు తీహార్‌ జైలులో చనిపోయే వరకూ వారిని ఉరి తీయాలని పటియాలా హౌస్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు దోషులు ముఖేశ్‌ (32), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), అక్షయ్‌ కుమార్‌(31)లకు అదనపు సెషన్స్‌ జడ్జి సతీశ్‌ కుమార్‌ అరోరా డెత్‌ వారెంట్లు జారీ చేశారు.తీహార్ జైలులోని పార్లమెంట్ పై దాడి కేసులో నిందితుడు ఆయిన అఫ్జల్ గురు ను ఉరితీసిన 3వ నంబరు జైలు గదిలోనే నిర్భయ కేసులో దోషులను ఉరి తీయనున్నారు.

ఇప్పటికే ఉరి తీసే తలారీని ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి ఢిల్లీకి రప్పించారు.తీహార్ జైలులో ఈ నెల 22 వతేదీకి ముందే నిర్భయ దోషులకు మాక్ ఉరి కార్యక్రమం చేపట్టనున్నట్లు జైలు అధికారులు వివరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube