నిద్రతో 'కరోనా'కు చెక్?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత ఎలా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇంకా అలాంటి కరోనా వైరస్ కు మొద్దు నిద్రతో చెక్ పెట్టచ్చట.

 Tight Sleep, Prevent Corona Virus, Disease, Covid-19, Health Tip-TeluguStop.com

ఏంటి అని ఆశ్చర్యకరంగా అనిపించినప్పటికీ ఇది నిజం అని అంటున్నారు వైద్య నిపుణులు.అలా ఎందుకు ? నిద్రతో ఎలా అనుకుంటున్నారా.

అక్కడికే వస్తున్న.ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారికి సరైన వ్యాక్సిన్ లేదు.అందుకే ఈ వైరస్ నియంత్రణకు ఇమ్యునిటీని పెంచుకోవ‌డ‌మే సరైన మార్గ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు, వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే.ఇంకా దీనికి సరైన నిద్ర ఉంటే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి అలాగే ఉంటుంది.

అదే సరిగ్గా నిద్ర‌పోక‌పోతే శ‌రీరంలో తెల్ల ర‌క్త క‌ణాల ఉత్ప‌త్తి త‌గ్గిపోతాయ‌ట‌. శ‌రీరంలో వైర‌స్ బారిన ప‌డిన క‌ణాల్ని చంపేవి ఈ తెల్ల రక్త కణాలేనట.

అందుకే నిద్ర తక్కువ అయ్యే కొద్ది ఒంట్లో వైరస్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు.ఒకవేళ కరోనా వైరస్ వ్యాపించినప్పటికీ రోజుకు ఎనిమిది లేదా అంతకుమించి గంటలు నిద్రపోతే మంచి ఫలితం ఉంటుందట.

ఇంకా ఉదయం లేవగానే కాసేపు ఎండ‌లో ఉండి, కాఫీ, టీలు కూడా తాగ‌డం త‌గ్గించాలి.ఇంకా రాత్రి తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా ఉంటే మంచిది.ఇక నిద్రపోయే ముందు పాలు లేదా మజ్జిగ తాగితే రాత్రి పూట మంచి నిద్ర పడుతుందని వైద్యులు చెప్తున్నారు.అందుకే రోజుకు 8 గంటలు నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube