దసరా పండుగకు అన్ని గ్రామాల్లో గట్టి బందోబస్తు:మోటకొండూర్ ఎస్ఐ పాండు

యాదాద్రి భువనగిరి జిల్లా:దసరా పండుగ( Dussehra )ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ ఎస్సై పాండు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం జరగబోయే దసరా వేడుకల్లో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

యువకులు గంజాయి,డ్రగ్స్( Cannabis, drugs ) లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మండలంలో ఎక్కడైన గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానస్పదంగా తిరుగుతున్నట్లైతే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

డిసెంబర్ 12 లోపు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలను సమర్పించాలి - జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Latest Yadadri Bhuvanagiri News