దసరా పండుగకు అన్ని గ్రామాల్లో గట్టి బందోబస్తు:మోటకొండూర్ ఎస్ఐ పాండు

యాదాద్రి భువనగిరి జిల్లా:దసరా పండుగ( Dussehra )ను ప్రజలు ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని,శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District) మోటకొండూర్ ఎస్సై పాండు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.మండలంలోని అన్ని గ్రామాల్లో శనివారం జరగబోయే దసరా వేడుకల్లో ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

 Tight Security In All Villages For Dussehra Festival: Motakondur Si Pandu, Sec-TeluguStop.com

యువకులు గంజాయి,డ్రగ్స్( Cannabis, drugs ) లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మండలంలో ఎక్కడైన గుర్తు తెలియని వ్యక్తులు, అనుమానస్పదంగా తిరుగుతున్నట్లైతే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube