టూరిస్ట్ లని పరుగులు పెట్టించిన పులి... సోషల్ మీడియాలో వైరల్  

Tiger Chases A Tourist Vehicle-tiger Chases,tourist Vehicle

పులిని దగ్గర నుంచి చూడాలనుకుంటే కొంచెం రిస్క్ అయినా పర్లేదు… కానీ అదే పులితో ఫోటోలు దోగాలనుకోవద్దు.పవన్ కళ్యాణ్ సినిమాలో త్రివిక్రమ్ రాసిన ఈ డైలాగ్ ఏదో హీరోయిజం చెప్పడానికి వాడిన ఇలాంటి సంఘటన నిజంగానే జరిగింది.పులిని ఫోటోలు తీయడానికి ట్రై చేసిన కొంత మంది టూరిస్ట్ లకి ఆ పులి చుక్కలు చూపించింది.ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేసిన టూరిస్ట్ లని వెంబడించి భయపెట్టింది.

Tiger Chases A Tourist Vehicle-tiger Chases,tourist Vehicle Telugu Viral News Tiger Chases A Tourist Vehicle-tiger Tourist Vehicle-Tiger Chases A Tourist Vehicle-Tiger Vehicle

ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది.

రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్కులో కొంతమంది టూరిస్టులు ఓపెన్ టాప్ జీపులో వెళ్తూ సమీపంలో కనిపించిన ఓ పులికి ఫోటో తీసే ప్రయత్నం చేశారు.ఈ విషయాన్ని గమనించిన పులి అతనివైపు వేగంగా పరిగెత్తుకుని వచ్చింది.దీంతో వాళ్ళు భయంతో వాహనాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లారు.

అయినా ఆ పులి టూరిస్టుల వాహనాన్ని కొంత వరకు వెంబడించింది.ఈ ఘటన డిసెంబర్ 1న చోటుచేసుకోగా ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతుంది.ఈ వీడియోపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్ లు పెడుతున్నారు.ఈ వీడియో చూసిన పర్యావరణ వేత్తలు పులులు వాటి సహజ సిద్ధమైన ఆవాసాలను కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.