వైరల్‌ : పులితో చెలగాటం.. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న బైకర్స్‌  

Tiger Chases A Bike Rider-

సరదా కోసం చేసే కొన్ని పనులు ప్రాణాల మీదకు తీసుకు వస్తాయి.కొన్ని సార్లు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.అడవిలో కొన్ని సార్లు ఎంత వెదికినా జంతువులు కనిపించవు.కాని కొన్ని సార్లు దురదృష్టం వెంట ఉంటే మాత్రం వెదకున్నా కూడా వెంట పడి చంపేస్తాయి.తాజాగా కర్ణాటక రాష్ట్రంకు చెందిన ఇద్దరు యువకులను చూసిన పులి వారి వెంట పరుగు పెట్టింది.

Tiger Chases A Bike Rider--Tiger Chases A Bike Rider-

అయితే అదృష్టం కొద్ది వారు బైక్‌పై ఉన్న కారణంగా తృటిలో ప్రాణాలు దక్కించుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

Tiger Chases A Bike Rider--Tiger Chases A Bike Rider-

పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటక రాష్ట్రం గుండ్లుపేట ప్రాంతంకు చెందిన ఇద్దరు స్నేహితులు బైక్‌పై అటవి మార్గంలో ప్రయాణిస్తున్నారు.అటవి ప్రాంతంలో ఏమైనా జంతువులు కనిపిస్తాయా అంటూ వారిద్దరు చూస్తూ వస్తున్నారు.ఒక వ్యక్తి కెమెరాతో చుట్టు పక్కలను బంధిస్తున్నాడు.ఆ సమయంలోనే ఒక పొదలోంచి పులి బయటకు వచ్చింది.వీరిని గమనించిన పులి బైక్‌ వెంట పడింది.పులిచి చూసిన బైక్‌ నడుపుతున్న వ్యక్తి బైక్‌ వేగం పెంచాడు.

కొద్ది సెకన్లు బైక్‌ వెంట పరిగెత్తిన పుల్లి లాభంలేదనుకుని పక్కకు వెళ్లింది.అయితే ఒకానొక సమయంలో చాలా దగ్గరకు వచ్చింది.అప్పుడు ఎగిరి పంజా కొడితే ఖచ్చితంగా బైక్‌పై వెళ్తున్న ఆ స్నేహితులు కింద పడేవారు.

అప్పుడు ఆ పులికి వారు భోజనం అయ్యేవారు.కాని వారి అదృష్టం బాగుండి ఇద్దరు కూడా సేఫ్‌గా బయట పడ్డారు.ఆ స్నేహితులు తృటిలో ప్రాణాలు దక్కించుకుని బయట పడ్డారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.ఈ స్నేహితులు ఇద్దరు కూడా చాలా అదృష్టవంతులంటూ అంతా కూడా కామెంట్స్ చేస్తున్నారు