జింక‌తో రొమాన్స్ చేస్తున్న పులి..!

కొన్ని సందర్భాల్లో ప్రకృతిలో వింత సంఘటనలు చోటు చేసుకుంటాయి.బద్ధ శత్రువులు కూడా మిత్రులుగా ఫీల్ అవుతుంటారు.

 Tiger, Deer, Romance-TeluguStop.com

వేటాడే జంతువులను సైతం జాలిగా దగ్గరకు తీసుకుంటాయి.వాటిపై శ్రద్ధ చూపుతాయి.

అలాంటి ఘటనే మరోమారు చోటు చేసుకుంది.పులికి జింక కనిపిస్తే చాలు ఎప్పుడు లగెత్తి నోట్లో పెట్టుకుందామా అని ఆలోచిస్తుంది.

కానీ ఈ పులి మాత్రం జింకతో సరదాగా గడపాలని అనుకుంది.ఆశ్చర్యంగా ఉంది కదూ.కానీ ఇది నిజం.క్రూర మృగాలు సైతం జాలి గుండెను, ప్రేమానురాగాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

గడ్డి మేస్తున్న జింక దగ్గరికి ఓ చిరుత వచ్చింది.చిరుతను చూసి ఆ జింక పారిపోలేదు.ధైర్యంగా పులి దగ్గరికి వెళ్లి నిలబడింది.అప్పుడు అందరూ ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు.

ఆ పులి జింకను తన పార్టనర్ అనుకుందో ఏమో కానీ చిరుత నెమ్మదిగా జింక దగ్గరికి వచ్చి తన నాలికతో జింక ముఖాన్ని తడిమింది.అయితే ఈ రెండు జంతువుల మధ్యలో కంచె ఉంది కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ జింక చిరుత నోట్లో రోస్ట్ అయ్యేది.

చిరుత, జింకకు సంబంధించిన వీడియో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి పోస్ట్ చేయడంతో వీడియో కాస్త వైరల్ అయింది.ఊహించని రీతిలో జంతువుల మధ్య బంధం కనిపించింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురై పలు కామెంట్ల పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube