ఏంది భయ్యా...పులి కూడా పాట పాడుతుందా?

పులి ఎంత క్రూరమైన జంతువో మనకు తెలిసిన విషయమే.ఒకప్పుడు పులిని చూడాలంటే జూ పార్క్ కు తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లి ఇదిగో ఇది పులి అని చూపించే వారు.

 Tiger Cub Singing Video Viral-TeluguStop.com

అయితే ఎక్కువగా దట్టమైన అడవుల్లో సంచరించే పులి, ఆ దట్టమైన అడవులను కాలక్రమేణా నాశనం చేస్తుండడం వలన అవి జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి.అయితే మనం చేసిన తప్పిదం ఎంత పెద్దదో ఇప్పుడు పులులు మనుషుల మీద దాడులు చేస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది.

ఇక అసలు విషయానికొస్తే పులికి వేటాడటం మాత్రమే తెలుసు.వేటాడిన తరువాత మరల విశ్రాంతి తీసుకుంటుంది.

 Tiger Cub Singing Video Viral-ఏంది భయ్యా…పులి కూడా పాట పాడుతుందా-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాని పులి పాట పాడడం ఎప్పుడైనా చూసారా.ఏంటి పులి పాట పాడటం ఏంటని అనుకుంటున్నారా.పాటలు మనుషులు కదా పాడేది.అని కదా మీ అనుమానం.పులి పాట పాడింది.సైబీరియన్ నగరంలోని బర్నాల్ లో లెస్నాయ స్కజ్కా పేరుతో ఒక జూ ఉంది.

అయితే ఆ జూలో ఓ పులి వింతగా గాండ్రిస్తు న్నది.గాండ్రింపు భయంకరంగా కాకుండా శ్రావ్యంగా ఉండడంతో జూ సిబ్బంది దీన్ని అరుదైన సన్నివేశంగా గుర్తించారు.

ఇలా శ్రావ్యంగా అరుస్తున్నప్పుడు జూ సిబ్బంది వీడియో తీశారు.అయితే ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు రకరకాల కామెంట్స్, లైక్స్, షేర్స్ తో ఈ వీడియో మరింత వైరల్ గా మారుతోంది.మీకు ఎప్పుడెప్పుడు ఈ వీడియో చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి మరి.

#TigerCub #SiberianTiger #Siberian Tiger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు