వెదురు కర్రతో టిఫిన్ క్యారియర్, భలే ఉంది చూడండి!

సహజంగా మనకు టిఫిన్ బాక్స్ లేదా లంచ్ బాక్స్ లను ఇన్నాళ్లు స్టీల్ లేదా ప్లాస్టిక్, ఇత్తడి బాక్స్ లకి ఉపయోగిస్తుంటాం.అవి కాదు అంటే యూజ్ అండ్ త్రో బాక్స్ లను ఉపయోగించటం.

 Bamboo Tiffin Carrier, Bamboo, Eco Friendly, Tiffin Carrier Made With Bamboo-TeluguStop.com

మరి ఎప్పుడైనా వెదురు కర్రలతో చేసిన టిఫిన్ బాక్స్ ని చూసారా.ఇప్పుడు వెదురు కర్రలతో చేసిన టిఫిన్ బాక్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది.

దీన్ని చూస్తే మీరు కూడా వావ్ అంటారు.అచ్చం ప్లాస్టిక్ టిఫిన్ క్యారియర్ ల ఆ బాక్స్ ఉంది.
ఇంకా ఈ వెదురు కర్రలతో టిఫిన్ బాక్స్ చేసింది ఎక్కడో కాదు మణిపూర్లోని చురాచందర్పూర్ వద్ద జోగం అనే వ్యక్తి తయారు చేస్తున్నాడు.ఓ స్వచ్ఛంద సంస్థలో ఈ వెదురు కర్రలతో టిఫిన్ బాక్స్ లను తయారు చేస్తున్నారు.

ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నారు.దీనికి సంబంధించిన ఓ వీడియో అటవీశాఖ అధికారి సుధా రామ్మోహన్ ట్విట్టర్లో షేర్ చేశారు.

దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే వెదురు కర్రతో తయారు చేసిన టిఫిన్ బాక్స్ చూడ్డానికి ఎంతో అందంగా సౌకర్యంగా ఉంది.

అయితే ఇది సౌకర్యంగా అందంగానే కాకుండా వెదురు కర్రలతో టిఫిన్ బాక్స్ చేయడం అనేది ఎన్నో కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నట్టు సుధా రామ్మోహన్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు.అంతేకాదు వెదురు కర్రలతో తయారైన సహజ ఉత్పత్తుల ప్రయోజనాలు చూపించడానికి మాత్రమే ఈ వీడియోను పంచుకున్నట్టు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube