టికెట్లు అమ్మేసుకున్నారు బాబోయ్ !  

Tickets Are Sold In Congress-

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశయించి భంగపడ్డ నాయకులంతా ఇప్పుడు అధిష్టానం మీద. తమకు టికెట్ రాకుండా అడ్డు తగిలిన వారి మీద కారాలు ..

టికెట్లు అమ్మేసుకున్నారు బాబోయ్ ! -Tickets Are Sold In Congress

మిర్యాలు నూరడమే కాదు… ఏకంగా… సాక్షాదారాలతో సహా రుజువులు చూపిస్తూ … మీడియా గొట్టాల ముందు తమ ప్రతాపం చూపిస్తున్నారు. తాజాగా… రాష్ట్ర కాంగ్రెస్‌ న్యాయకత్వంపై రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ నాయకుడు క్యామ మల్లేశ్‌ మండిపడ్డారు. టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్‌ పార్టీ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ పెద్దల అవినీతి బాగోతానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయంటూ ఆడియో టేపులను విడుదల చేశారు.

ఇబ్రహీంపట్నం టికెట్ కావాలంటే రూ.3 కోట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్ దాస్ కొడుకు సాగర్ డిమాండ్ డిమాండ్‌ చేశారని ఆరోపించారు. అలాగే టీఆర్‌ఎస్‌ నాయకుడు దానం నాగేందర్‌తో కుమ్మకై 10 కోట్లు తీసుకొని ఆయనపై బలహీత నేత దాసోజు శ్రవణ్‌ను నిలబెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఈ నెల 2న భక్తచరణ్‌దాస్‌ దగ్గరకు నా కుమారుడిని పంపిస్తే. ఇబ్రహీంపట్నం టికెట్‌ కావాలంటే 3 కోట్లు ఇవ్వాలని భక్తచరణ్‌ దాస్‌ కుమారుడు సాగర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఆడియోను రాష్ట్ర నాయకులందరికి చూపించాను.అయినప్పటికీ వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

కాంగ్రెస్‌లో చాలా మంది బ్రోకర్లు చేరారు. డబ్బులు తీసుకొని నాలాంటి నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నారు. ఈ విషయాలు ఏవీ రాహుల్‌ గాంధీ దృష్టికి పోకుండా జాగ్రత్త పడుతున్నారు.

అంనంటూ ఆయన మండిపడ్డారు.