టికెట్ రేట్ల కమిటీ రిపోర్ట్ లీక్.. భారీగా పెరగనున్న టికెట్ రేట్లు?

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వానికి మధ్య గత కొద్ది రోజుల నుంచి టికెట్ల రేట్లు గురించి చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టికెట్ల రేట్లు పెంచాలని సినీ పెద్దలు ఏపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నపం చేసుకున్న ఈ విషయంలో మాత్రం ఏపీ ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది.

 Ticket Rates Committee Report Leak Ticket Rates Rise So Much Ticket Rates, Repor-TeluguStop.com

ఈ క్రమంలోనే టికెట్ల రేట్ల వ్యవహారంపై నివేదిక ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టిక్కెట్ల రేట్లపై కమిటీ సమర్పించిన రిపోర్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో లీక్ అవడంతో సినిమా టికెట్లు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని జగన్ తో భేటీ ఈ విషయం గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

కాగా నేడు మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, దానయ్య, మహేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్టీఆర్ వంటి వారు జగన్ తో భేటీ కానున్నట్లు మనకు తెలిసిందే.అయితే టికెట్ల రేట్లు గురించి నేడు ఈ భేటీ అనంతరం క్లారిటీ రానుంది.

ఇక టిక్కెట్ల రేట్లపై కమిటీ నివేదించిన రిపోర్ట్ ప్రకారం,మల్టీప్లెక్స్‌ టికెట్ల రేట్లలో పెద్దగా తేడాలు లేకపోయినా మునిసిపాలిటీ నగర గ్రామ పంచాయతీలలో ఉండే థియేటర్ల టికెట్ల విషయంలో మార్పులు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది.ప్రాంతం ఏదైనా సరే, నాన్‌ ఏసీ థియేటర్లు ఎక్కడున్నా సరే కనీస టికెట్ ధర 30 ఉండాలని కమిటీ నిర్ణయించింది.అయితే ఏపీ ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో 35 ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 5 రూపాయలు మాత్రమే ఉండేది.అదే విధంగా నాన్‌ ఏసీల్లో గరిష్టంగా ఉన్న 15 రూపాయల టికెట్ ధరను 70 రూపాయలకు పెంచాలని కమిటీ తమ నివేదికలో పేర్కొంది.

ఈ విధంగా టిక్కెట్ల రేట్లపై కమిటీ సమర్పించిన నివేదిక ప్రకారం సినిమా టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయని తెలుస్తుంది.అయితే ఈ విషయం గురించి సినీ పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అనంతరం అధికారికంగా తెలియ జేయనున్నట్లు తెలుస్తోంది.

Ticket Rates Committee Report Leak Ticket Rates Rise So Much Ticket Rates, Report Leak, Leak, Rates Rise, Andrapradesh - Telugu Andrapradesh, Ap, Leak, Rates, Ticket Rates

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube