బిగ్ బాస్ ఆఫర్ పై టిక్ టాక్ స్టార్ దుర్గారావు వైరల్ కామెంట్స్

బహుశా సోషల్ మీడియాను విపరీతంగా వాడే వాళ్ళకు టిక్ టాక్ స్టార్ దుర్గారావు తెలియని వారుండరని చెప్పుకోవచ్చు.ఎందుకంటే టిక్ టాక్ లో ఉన్నప్పుడు స్టార్ లుగా ఫీల్ అయిన వాళ్ళందరూ టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత కనుమరుగైపోయారు.

 Tik Tok Star Durga Rao Viral Comments On Bigg Boss Offer, Tik Tok Star, Durga Ra-TeluguStop.com

కాని రాసిపెట్టుంటే ఏదైనా జరగొచ్చు.టిక్ టాక్ స్టార్ దుర్గారావు జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

టిక్ టాక్ బ్యాన్ అయిన తరువాత రఘు కుంచె సంగీత దర్శకత్వంలో వచ్చిన నాది నక్కిలేసు గొలుసు అనే పాటతో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోయారు.ఇక వారికి రకరకాల అవకాశాలు వచ్చాయి.

ఇతర గేమ్ షోలలో పాల్గొంటూ టెలివిజన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు.అయితే రోజురోజుకు వీళ్ళ క్రేజ్ పెరుగుతూ ఉండటంతో ఇక వీరికి సినిమా అవకాశాలు దరి చేరాయి.

తాజాగా మాస్ మహారాజ్ నటించిన బ్లాక్ బాస్టర్ సినిమా క్రాక్ చిత్రంలో కూడా నటించారు.తరువాత జగపతిబాబుతో కూడా ఓ సినిమాలో కూడా దుర్గారావు నటిస్తున్నాడు.

అయితే బిగ్ బాస్ 5 కోసం బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది.అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలను బట్టి ఐతే ప్రస్తుతం బిగ్ బాస్ యాజమాన్యం ఈ సారి ఎక్కువగా సోషల్ మీడియా స్టార్లను ఎంపిక చేయనునట్లు తెలుస్తోంది.

అయితే బిగ్ బాస్ ఆఫర్ పై దుర్గారావును సంప్రదిస్తే సినిమా అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, తమను బిగ్ బాస్ వారు సంప్రదించారని ఇంకా తుది నిర్ణయం చెప్పలేదని, వెళ్ళడానికి ఎటువంటి అభ్యంతరం లేదని వారన్నారు.

Telugu @bigbosstelugu, Bigg Boss, Craze, Durga Rao, Jagapati Babu, Krack, Ravite .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube