Tibetian Mastiff Dog: ఇలాంటి కుక్కని పెంచుకోండి... పులినైనా వేటాడగలుగుతుంది!

అందమైన శునకాలు అంటే ఎవరికి ఇష్టముండదు.నేడు దాదాపుగా అందరూ తమ ఇళ్లల్లో ఇతర రకాల జాతుల శునకాలను పెంచడం అనేది పరిపాటిగా మారిందని చెప్పుకోవచ్చు.

 Tibetian Mastiff Breed Dog Specialities And Hunting Skills Details,  Dog, Tiger,-TeluguStop.com

దేశీయ శునకాలను ఎవరూ పెద్దగా ఇష్టపడరు గాని విదేశీయ శునకాలను మాత్రం మంచిగా సాకుతారు.ఎందుకంటే అవి చూడడానికి ముద్దుగా బొద్దుగా ఉంటాయి కాబట్టి.

అదే సమయంలో తమ ఇళ్లకు రక్షణ కోసం కూడా పెంచుకుంటూ వుంటారు.అలాంటి అరుదైన రకాలలో టిబెటియన్‌ మస్టిఫ్‌ ఒకటి.

ఇది టిబెట్‌ దేశానికి చెందిన ప్రత్యేక శునకం అని చెప్పుకోవాలి.

ఈ శునకం ఎక్కువగా చలి ప్రాంతాల్లోనే జీవించే అరుదైన జాతి అని చెప్పుకోవచ్చు.

ఇది చాలా తెలివైనది, అంతేకాకుండా చాలా బలమైనది.ఇక రక్షణ కల్పించే విషయంలో మాత్రం ఇది చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు.

చాలామంది దీనిని వేటాడడానికి పెంచుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.సాధారణంగా ఇవి 15 ఏళ్లు మాత్రమే జీవిస్తాయి.

గరిష్టంగా 65 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఈ జాతి శునకానికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉందంటే మీరు ఇక అర్ధం చేసుకోండి.

Telugu Attack, Tibetian Dos, Tibetianmastiff, Tiger, Latest-Latest News - Telugu

ఇక శునక ప్రియులు వీటికోసం రూ.లక్షల్లో వెచ్చిస్తారు.అయితే ఈ మస్టిఫ్‌ జాతి శునకం మనదగ్గర చాలా అరుదుగా పెంచుతారు.

దానిగురించి తెలిసినవారు మాత్రం అలాంటిదాన్ని విడిచిపెట్టరు.ఎంత వెచ్చించైనా సొంతం చేసుకుంటారు.

కాగా అనంతపురం సాయి నగర్‌ ఒకటో క్రాస్‌లో బుక్కచెర్ల నల్లపరెడ్డి నివాసంలో ఉండే ఈ రకమైన జాతికి చెందిన జాగిలం పలువురిని ఆకర్షిస్తోంది.చల్లని ప్రాంతం నుంచి వచ్చిన కుక్క అయినప్పటికీ, ఇక్కడి వేడి వాతావరణానికి అలవాటు పడింది.

అయితే రోజుకి KG చికెన్‌ మాత్రం దానికి ఉండాలట.కాగా పూర్తిగా AC గదుల్లోనే సేద తీరడం విశేషం.

దీని ప్రత్యేకత ఏమంటే ఇది ఏకంగా పులినే చంపేయగలదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube