కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తొమ్మిదేళ్ళ క్రితం వచ్చిన సినిమా తుపాకీ.ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి విజయ్ అందుకుంది.
ఇందులో విజయ్ రెండో చెల్లి క్రింద నటించిన అమ్మాయి పేరు సంజనా సారథి.ఈ అమ్మడు గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, తుపాకీలో స్కూల్ గర్ల్ పాత్రలో కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.
నవీన్ చంద్ర హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా సంజనా సారథిని ఫైనల్ చేశారు.నవీన్ చంద్ర హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమా రెడీ అవుతుంది.
ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు.ఇక ఇందులో ఫిమేల్ లీడ్ కోసం సంజనాని ఫైనల్ చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే టాలీవుడ్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ అవికాగోర్ నవీన్ చంద్ర సోదరిగా కనిపించనుంది.
ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబందించిన పూర్తి విశేషాలు త్వరలో పంచుకోవడానికి చిత్ర యూనిట్ ఎదురుచూస్తుంది.ఇదిలా ఉంటే నటుడు నవీన్ చంద్ర ఓ వైపు చిన్న సినిమాలలో హీరోగా నటిస్తూ, పెద్ద సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు.
కోలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ విలన్ గా రాణిస్తున్నాడు.బోయపాటి, బాలయ్య సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది.అలాగే త్రివిక్రమ్, ఎన్టీఆర్ మూవీ కోసం కూడా నవీన్ చంద్రని కన్ఫర్మ్ చేసినట్లు బోగట్టా.