బీజేపీకి క‌లిసిరాని.. తుంగ‌భ‌ద్ర రాజ‌కీయం..!  

thungabadhra matter is not getting luck for BJP, karnataka, BJP government, thungabadhra river pushkarams, good luck, andhra pradesh , chief minister jagan mohan reddy, BJP leaders - Telugu Andhra Pradesh, Bjp Government, Bjp Leaders, Chief Minister, Good Luck, Jagan Mohan Reddy, Karnataka, Thungabadhra River Pushkarams

రాజ‌కీయాలు ఎప్పుడు క‌లిసి వ‌స్తాయో.ఎప్పుడు విక‌టిస్తాయో.

TeluguStop.com - Thungabadhra Matter Is Not Getting Luck For Bjp

కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి బీజేపీకి ఎదుర‌వుతోందా?  ఇప్ప‌టి వ‌ర‌కు కీల‌క విష‌యాల‌ను పావుగా చేసుకుని జ‌గ‌న్ స‌ర్కారుపై దూకుడు ప్ర‌ద‌ర్శించిన బీజేపీ.దేవాల‌యాల‌పై దాడుల‌ను త‌న‌కు అనుకూలంగామార్చుకుంది.

ఒకింత ఊపు వ‌స్తున్న క్ర‌మంలో ఎందుకో.ఒక్క‌సారిగా మౌనం వ‌హించింది.

TeluguStop.com - బీజేపీకి క‌లిసిరాని.. తుంగ‌భ‌ద్ర రాజ‌కీయం..-Political-Telugu Tollywood Photo Image

ఇక‌, బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఏకంగా.మీడియాకు క‌నిపించ‌డం మానేశారు.

ప్రెస్‌మీట్లు పెడుతున్నా.కూడా ఎంచుకున్న వారిని మ‌త్ర‌మే ఆహ్వానిస్తున్నారు.

అదేస‌మ‌యంలో ఎంచుకున్న స‌బ్జెక్టుపైనే మాట్లాడుతున్నారు.

దీంతో బీజేపీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే.ఏ జిల్లాకు ఆ జిల్లాలో పార్టీ ఎదుగుద‌ల‌కు ఉన్న అన్ని అవ‌కాశాల‌నూ వినియోగించుకునేందుకు బీజేపీ పెద్ద‌లు అక్క‌డి స్థానిక నేత‌ల‌కు స‌మాచారం అవ‌కాశం క‌ల్పించారు.

దీంతో క‌ర్నూలు జిల్లా బీజేపీ నేత‌లు.ఓ చ‌క్క‌టి విష‌యాన్ని అందిపుచ్చుకున్నారు.

అదే . తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలు.వ‌చ్చే నవంబ‌రు నెలాఖ‌రులో ఈ న‌దికి పుష్క‌రాలు జ‌ర‌గ‌నున్నాయి.దీనికి సంబందించి సుమారు 60 కోట్ల రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

అయితే.నిధులు ఇచ్చినా.కూడా పుష్క‌రాల‌ను నిర్వ‌హించ‌రాద‌ని నిర్ణ‌యించుకున్నట్టు జీవో ఇచ్చింది.ఇంకేముంది.బీజేపీ నేత‌ల‌కు అత్యంత కీల‌క‌మైన విష‌యం అందిన‌ట్టు అయింది.పుష్క‌రాలంటే.

హిందూ సంప్ర‌దాయంలో ఉన్న వారికి ఎంతో కీల‌కం క‌నుక‌.తుంగ‌భ‌ద్ర న‌ది పుష్క‌రాల విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కారు అవలంబిస్తున్న‌తీరును ఎండ‌గ‌ట్టాల‌ని క‌ర్నూలు బీజేపీ నేత‌లు నిర్ణ‌యించుకున్నారు.

దీంతో ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు.

తీరా.

జెండాలు ప‌ట్టుకుని ముందుకు రావ‌డంతోనే వారికి సోము నుంచి ఫోన్లు వ‌చ్చాయ‌ట‌.మీరు వెన‌క్కి వెళ్లిపోండి.

త‌ర్వాత చూసుకుందాం.అని ఆయ‌న చెప్ప‌గానే వారంతా ఇంటి ముఖం ప‌ట్టారు.

ఇంత‌కీ విష‌యం ఏంటని ఆరా తీస్తే.క‌ర్ణాట‌క‌లో ఉన్న బీజేపీ స‌ర్కారే అక్క‌డ కీల‌క‌మైన తుంగ‌భ‌ద్ర న‌ది పుష్క‌రాల‌కు దూరంగా ఉంది.

సో.ఇప్పుడు మ‌నం ఇక్క‌డ ఆందోళ‌న చేస్తే.ప‌రువు పోతుంది.ఆయ‌న హెచ్చ‌రించాట‌.ఇదీ.సంగ‌తి.!!

.

#Karnataka #Chief Minister #Bjp Leaders #Good Luck #BJP Government

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thungabadhra Matter Is Not Getting Luck For Bjp Related Telugu News,Photos/Pics,Images..