పగబట్టిన ప్రకృతి... తాజ్ మహల్ కి పిడుగు దెబ్బలు

భారతదేశంపై ప్రకృతి పగబట్టిందా అంటే అవుననే మాట ఈ మధ్యకాలంలో జరుగుతున్నా సంఘటలు చూస్తున్నవారు చెబుతారు.ఓ వైపు కరోనా వైరస్ మాటున ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా కుదేలైపోయింది.

 Thunderstorm, Damages Minor Structures In Taj Mahal, Lock Down, Corona Effect, N-TeluguStop.com

ఇప్పుడిప్పుడే అభివృద్ధిలో పరుగులు పెడుతూ ప్రపంచంలో ఆధిపత్యం దిశగా దూసుకుపోతున్న భారత్ ని ఈ కరోనా వైరస్ అతలాకుతలం చేసేసింది.అయితే ఈ కరోనా వైరస్ మాటున వ్యవస్థలు అన్ని మూతబడటంతో ప్రకృతిని తనని ప్రక్షాళన చేసుకుంది.

కరోనా సమస్య ఇంకా తీరకుండానే అరణ్యంలో ఉండాల్సిన అడవి జంతువులు సిటీలలోకి వచ్చి ప్రజలపై దాడి చేస్తున్నాయి.మరో వైపు మిడతల రూపంలో రైతన్న కష్టం నాశనం చేయడానికి కీటకాలు వచ్చాయి.

ఇప్పుడు ప్రకృతిలో వాతావరణం పిడుగుల రూపంలో ప్రతాపం చూపిస్తున్నాయి.

ఇప్పటికే ఒక తుఫాన్ పశ్చిమ బెంగాల్ ని అతలాకుతలం చేసేసింది.

వందల మంది ప్రాణాలు తీసేసింది.వేల కోట్ల సంపదని నాశనం చేసేసింది ఇక వాతావరణంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పిడుగులు పడుతున్నాయి.దేశవ్యాప్తంగా పిడుగుపాటు ఘటనలు ఎక్కువయ్యాయి.

మారిన వాతావరణ పరిస్థితులతో ఉరుములు, వడగళ్ళ వానతో పాటు ఉరుములు, మెరుపులతో పడుతున్న పిడుగుల కట్టడాలని నాశనం చేస్తున్నాయి.తాజాగా ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక కట్టడం తాజ్ మహల్ వద్ద పిడుగులు పడ్డాయి.

పిడుగుల ధాటికి తాజ్ మహల్ కదిలిపోయింది.ఈ పిడుగుపాటుతో ప్రధాన ద్వారం వద్ద గోడలు, రాతితో నిర్మించిన పిట్టగోడ, పాలరాతితో నిర్మించిన మరో పిట్టగోడ, పర్యాటకులు నిల్చునే ప్రదేశంలోని పైభాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు.

మరి అర్ధ సంవత్సరం పూర్తికాకుండానే ఈ ఏడాది ప్రకృతి ఇన్ని రకాలుగా విద్వంసం చూపిస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఆందోళన ప్రజలలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube