"పండగ" పూట ప్రభుత్వానికి "చెక్"

రాష్ట్ర విభజన తరువాత సీమాంధ్ర రాజధానిగా ‘తుళ్ళూరు ‘ను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.అయితే ప్రకటించినంత సులభంగా రాజధాని నిర్మాణం మొదలవుతుంది అనుకోవడం ఒకింత హాస్యాస్పదమే అవుతుంది.

 Thullur Farmers Different Strategy In “cm”-TeluguStop.com

ఇంతవరకు ఎలా ఉన్నా.రాజధాని నిర్మాణం చేపట్టాల్సిన ప్రాంతంలో అనేక ఇబ్బందుల నడుమ ప్రభుత్వం కొట్టి మిట్టాడుతూ కొనఊపిరితో కొట్టుకుంటుంది.

ఇక ఇదే క్రమంలో అధిక శాతం రైతులు రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇస్తాం అంటూ ప్రకటించగా, మరికొందరు తాము ఇవ్వబోము అంటూ వ్యతిరేకించారు.ఇక తెలుగు పండుగను పురస్కరించుకుంది తమ నిరసనను వినూత్న రూపంలో తెలియజేశారు.

పెనుమాక ప్రాంతం రైతులు గ్రామంలోని రామాలయం సెంటర్లో బుధవారం రాజధాని నిర్మాణానికి తమ భూములు ఇవ్వబోమని నిరసన వ్యక్తం చేస్తూ ముగ్గుల రూపంలో ప్రభుత్వానికి తమ వాణిని వినిపించారు.ఇళ్లలోనూ ముగ్గులేసి భూములిచ్చే ప్రసక్తే లేదని విన్నవించారు.

చంద్రబాబు తమ గ్రామం మీద కక్షతో వ్యవహరిస్తున్నారని, భూములు ఇవ్వబోమన్న తమపై బల ప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారని పలువురు రైతులు చెబుతున్నారు.మరి ఇదంతా రైతులే చేస్తున్నారా, లేక వెనుక నుండి ఏమైనా శక్తులు నడిపిస్తున్నాయా అన్న అనుమానం సైతం కనిపిస్తుంది.

చూడాలి మరి ఏం జరగబోతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube