అమెరికాలో తెలుగోడి సత్తా ఇదీ...!  

Thulasi Chaitanya Swim Catalina Channel-nri,thulasi Chaitanya

ఎక్కడ ఉన్న తెలుగు వారి పట్టుదల ముందు మిగలిన వారు తేలిపోతారు.ఒక్క సారి మంకుపట్టు పడితే తప్పకుండా దాన్ని సాధించుకునే వరకూ శ్రమిస్తూనే ఉంటారు.ముఖ్యంగా ఇతర దేశాలలో ఉండే భారతీయులు, తెలుగువారు పరాయి దేశంలోనే మన సత్తా మరింత చాటాలని, సొంత గడ్డ పేరు విదేశీ గడ్డపై మారుమోగాలని తహతహలాడుతుంటారు.

Thulasi Chaitanya Swim Catalina Channel-nri,thulasi Chaitanya-Thulasi Chaitanya Swim Catalina Channel-Nri

Thulasi Chaitanya Swim Catalina Channel-nri,thulasi Chaitanya-Thulasi Chaitanya Swim Catalina Channel-Nri

 ఈ క్రమంలోనే రికార్డులు వినూత్నంగా తమ ప్రతిభని ఆవిష్కరిస్తూ ఉంటారు.కొంతమంది తమలూ ఉన్న టాలెంట్ బయటపెడితే మరి కొందరు వివిధ రంగాలలో ఉన్నత స్థానాన్ని చేరుతుంటారు.తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఓ రికార్డ్ తెలుగోడి సత్తాని చాటి చెప్పింది.

వివరాలలోకి వెళ్తే.

అమెరికాలో క్యాటాలినా ఛానెల్ ఎంతో ప్రసిద్ది చెందినది.ఈ ఛానెల్ ని ఈదిన తొలి తెలుగు రాష్ట్రాల వ్యక్తిగా విజయవాడకి చెందిన తులసి చైతన్య కి దక్కింది.దాంతో తులసీ చైతన్య రికార్డ్ క్రియేట్ చేశారు.తులసీ చైతన్య విజయవాడ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు.

క్యాటాలినా ద్వీపం నుంచీ

రాంఛొపాలొ వరకూ సుమారు 35 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 12 గంటల 40 నిమిషాల సమయంలో అధిగమించి రికార్డ్ సృష్టించారు.ఈ రికార్డ్ క్రియేట్ చేసిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కావడం విశేషం.