అట్టర్‌ ఫ్లాప్‌ అయిన మూవీ ‘బాహుబలి 2’ రికార్డు బ్రేక్‌.. ఇదో అద్బుతం   Thugs Of Hindustan Movie Gets Huge Collection For This Deepawali     2018-11-10   10:41:50  IST  Ramesh P

బాలీవుడ్‌లో ఎన్ని పెద్ద సినిమాలు, సూపర్‌ స్టార్‌ హీరోల సినిమాలు వచ్చినా కూడా గత సంవత్సరంనర కాలంగా ‘బాహుబలి 2’ రికార్డు అలాగే ఉంటుంది. మొదటి రోజు వసూళ్లలో బాహుబలి 2 అద్బుతమైన రికార్డును దక్కించుకుంది. దాదాపు 45 కోట్ల వసూళ్లను రాబట్టిన బాహుబలి 2ను మొన్నటి వరకు ఏ చిత్రం బ్రేక్‌ చేయలేక పోయింది. దేశ వ్యాప్తంగా దాదాపు 5000 థియేటర్లలో బాహుబలి 2 విడుదలై రికార్డును సాధించగా, తాజాగా విడుదలైన ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం ఆరు వేల థియేటర్లలో విడుదలై బాహుబలి 2 రికార్డును బ్రేక్‌ చేయడం జరిగింది.

‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’ చిత్రం మొదటి రోజే నెగటివ్‌ టాక్‌ దక్కించుకున్నా కూడా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయడంతో పాటు, టికెట్ల రేట్లు పెంచడం వల్ల 53 కోట్ల వరకు రాబట్టినట్లుగా సమాచారం అందుతుంది. మొదటి రోజు కలెక్షన్స్‌ రికార్డు బద్దలు కొట్టాలని ప్రయత్నించిన అమీర్‌ ఖాన్‌ అన్నట్లుగానే చేసేశాడు. అయితే సినిమాకు అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం కనీసం 200 కోట్ల వసూళ్లు అయినా సాధిస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడిలో సగం వచ్చే పరిస్థితి లేదు అంటూ సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Thugs Of Hindustan Movie Gets Huge Collection For This Deepawali-

అమీర్‌ ఖాన్‌ నటించిన సినిమాలో ఇదే అత్యంత చెత్త సినిమా అని, ఈ చిత్రంలో అమితాబచ్చన్‌ ఎలా నటించాడో అర్థం కావడం లేదని, అసలు ఈ చిత్రంలో కథ ఏముంది అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అమీర్‌ ఖాన్‌ కెరీర్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనే ఇదో పెద్ద డిజాస్టర్‌ మూవీ అంటూ తేలిపోయింది. ఒక అద్బుతమైన అవకాశంను అమీర్‌ ఖాన్‌ మిస్‌ చేసుకున్నాడు. ఈ చిత్రంతో రికార్డులు బద్దలు చేయాలనుకున్న అమీర్‌ ఖాన్‌ కేవలం మొదటి రోజు రికార్డులతోనే సరిపెట్టుకున్నాడు.