చైనా ను వణికిస్తున్న మరో అంటువ్యాధి,అయితే….  

Thrombocytopenia syndrome Virus infected in China, China, new Virus Cases, Corona - Telugu China, Corona, New Virus Cases, Thrombocytopenia Syndrome Virus Infected In China

చైనా లో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను వణికిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.వూహన్ లోని ఒక ల్యాబ్ లో మొదలైన ఈ మహమ్మారి తో నేడు ప్రపంచ దేశాలు యుద్ధమే చేస్తున్నాయి.

 Thrombocytopenia Syndrome Virus Infected China

ఇంకా ఈ మహమ్మారి నుంచి బయటపడకుండానే అదే చైనా లో మరో వైరస్ వెలుగుచూడడం మరింత ఆందోళన కలిగిస్తుంది.అయితే ఊపిరి పీల్చుకొని అంశం ఏమిటంటే ఇది కరోనా లా ఒకరి నుంచి మరొకరికి నేరుగా కాకుండా ఇతర పరిస్థితుల్లో ఈ వైరస్ అనేది ఇతరులకు వ్యాపిస్తుందట.

ఇంతకీ ఈ వైరస్ ఏంటో తెలుసుకుందా. థ్రోఎంబో సైట్ పెనీయా సిండ్రోమ్ బున్యా అనే ఈ వైరస్ నల్లి వంటి కీటకాల ద్వారా మనుషుల్లో వ్యాప్తి చెందుతుందట.

చైనా ను వణికిస్తున్న మరో అంటువ్యాధి,అయితే….-General-Telugu-Telugu Tollywood Photo Image

అంటే నేరుగా కాకపోయినా రక్తం లేదా శ్లేషం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందట.ప్రస్తుతం ఈ వైరస్ చైనా లోని జియాంగ్ ప్రావిన్స్,అన్హుయి ప్రావిన్స్‌,నాన్జియాంగ్‌కు ప్రాంతాల్లో ఈ వైరస్ లక్షణాలను గుర్తించినట్ట చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది.

ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 60 మంది ఇబ్బంది పడుతుండగా ఏడుగురు ప్రాణాలు కూడా కోల్పోయినట్లు తెలుస్తుంది.ఈ కీటకం ద్వారా వైరస్ సోకినప్పుడు వారికి వెంటనే దగ్గు,తీవ్ర జ్వరం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే 2011 లోనే ఈ వైరస్ ను శాస్త్రవేత్తలు జంతువులలోనే కనుకొన్నప్పటికీ ఇప్పుడు మెల్లగా ఈ వైరస్ మనుషులకు కూడా వ్యాపిస్తున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.గతఏడాది ఆగస్టులోనే కరోనా కేసులు చైనా లో వెలుగు చూసినప్పటికీ దాని యొక్క తీవ్రత గుర్తించడం లో నిర్లక్ష్యం వహించింది అంటూ ప్రపంచ దేశాలు కొన్ని అభిప్రాయపడ్డాయి.

అయితే ప్రస్తుతం ఈ వైరస్ గురించి కూడా డ్రాగన్ దేశం పట్టించుకోక పొతే ఇది ఎంతవరకు దారి తీస్తుందో అన్న భయం మొదలైంది.ఇప్పటికే ఈ వైరస్ తో 7 గురు మృతి చెందినట్లు అక్కడి అధికారిక పత్రిక వెల్లడిస్తుండగా,ఇంకా ఈ వైరస్ ఎంతమందికి సోకింది,దాని యొక్క ప్రభావం ఎంత ఉంది అన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#New Virus Cases #Corona #China

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Thrombocytopenia Syndrome Virus Infected China Related Telugu News,Photos/Pics,Images..