ఆమె ఒక మేయర్ అయినా పాలప్యాకెట్ల సరఫరా చేస్తున్నారు.! ఎందుకో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!  

Thrissur Mayor Ajitha Will Continue To Der Milk To The People-

ఈ మధ్య పలుకుబడి ఉన్న వారు బంధువులు అయితేనే ఒక రేంజ్ లో బయట ఓవర్ చేస్తున్నారు.అలాంటిది మేయర్ పదవిలో ఉండి కూడా ఆమె ద్విచక్రవాహనంపై పాల ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు.ఎంత అడిగినా ఒదిగే ఉండాలి అనే మాటను మరోసారి నిరూపించారు.కేరళలోని కనిమంగళం ప్రాంతానికి చెందిన అజిత విజయన్‌ పాల ప్యాకెట్లు నింపిన బ్యాగులను తన ద్విచక్ర వాహనంపై పెట్టుకుని ఇంటింటికి వెళ్లి అందిస్తుంది.

Thrissur Mayor Ajitha Will Continue To Der Milk To The People- Telugu Viral News Thrissur Mayor Ajitha Will Continue To Der Milk The People--Thrissur Mayor Ajitha Will Continue To Deliver Milk The People-

ఇలా ప్రతిరోజూ రెండు వందల ఇళ్లకు వెళ్లి పాలప్యాకెట్లను సరఫరా చేస్తుంది.ఆమె ప్రస్తుతం త్రిశూరు మేయర్‌గా ఎంపికైంది.అంతకు ముందు పాలు సరఫరా చేసే వ్యక్తిగా కనిమంగళం ప్రాంత వాసులకు తను సుపరిచితమే.దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ పని చేస్తోంది.

Thrissur Mayor Ajitha Will Continue To Der Milk To The People- Telugu Viral News Thrissur Mayor Ajitha Will Continue To Der Milk The People--Thrissur Mayor Ajitha Will Continue To Deliver Milk The People-

అజిత భర్త విజయన్‌ సీపీఐ(ఎమ్‌) నాయకుడు.భర్త గత ఇరవై రెండేళ్లుగా మిల్మా పేరిట మిల్క్‌ బూత్‌ నడుపుతోంటే… ఆమె అతనికి సాయంగా పాలప్యాకెట్లు వేస్తోంది.బుధవారం నాడు అజిత సీపీఐ(ఎమ్‌) పార్టీ నుంచి త్రిశూర్‌కు మేయర్‌గా ఎంపికైంది.ఇప్పటికీ ఈ ప్రాంత వాసులకు ఆమె పాలు సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతోంది.

అంతేకాక ఇలా పాలు సరఫరా చేయడం వల్ల ఇంటిఇంటికి వెళ్తుంటే ప్రజల సమస్యలు సులువుగా తెలుస్తున్నాయి ఆమె పేర్కొన్నారు.పార్టీలో పనిచేస్తూనే అయిదేళ్లు అంగన్‌వాడీ టీచరుగానూ విధులు నిర్వహించింది.

మహిళల కోసం పార్టీ రూపొందించిన పథకాలన్నీ అమలయ్యేలా చూడటం తన బాధ్యత అని అంటోంది అజిత.